ఐపీఎల్ వల్లే ఇదంతా.. సీనియర్లంటే భయం, భక్తీ రెండూ లేవు! యువరాజ్ సింగ్ కామెంట్స్...

First Published Dec 5, 2022, 4:46 PM IST

ప్రపంచ క్రికెట్‌కి ఎంతో మేలు చేసిన ఐపీఎల్, టీమిండియాకి మాత్రం అంతే చేటు చేసిందనేది చాలామంది టీమిండియా ఫ్యాన్స్ అభిప్రాయం... టీమిండియా ఏ టోర్నీలో ఓడినా మొదట టార్గెట్ అయ్యేది ఐపీఎల్‌యే...  ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఐపీఎల్, క్రికెట్ ప్రపంచంలో ఎన్నో మార్పులకు నాంది పలికింది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్... ఐపీఎల్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...
 

2000వ సంవత్సరంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన యువరాజ్ సింగ్, సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2003 వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్ ఆడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు...

సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్న యువీ, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు...

Image Credit: Getty Images

సౌతాఫ్రికా20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ లాంఛ్ చేసిన కొత్త ఫ్రాంఛైజీ కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్ సింగ్, తన సీనియర్ల గురించి, అప్పటి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి బయటపెట్టాడు.

‘20 ఏళ్ల తర్వాత కూడా నా పక్కన అనిల్ కుంబ్లే ఉన్నాడంటే నాలో ఓ రకమైన భయం పెరిగిపోతుంది. వినడానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా, సీనియర్లంటే మాకు అలాంటి భయం, గౌరవం ఉండేవి...

అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి సీనియర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. వాళ్లను టీవీల్లో చూస్తూ పెరిగిన నేను, వారతో కలిసి ఆడడం అంటే... ఇప్పటికీ ఆశ్చర్యంగానూ, గర్వంగానూ ఉంటుంది...

Image Credit: Getty Images

సీనియర్ల పక్కన కూర్చోవాల్సి వస్తే, అక్కడ కూర్చోవడానికి భయపడి కోచ్‌ని అడిగి సీటు మార్చుకునేవాళ్లం. అయితే కోచ్‌లు మాత్రం అతను మీ సీనియర్, పక్కన కూర్చోవాల్సిందేనని చెప్పేవాళ్లు. వాళ్లతో మాట్లాడడానికి చాలా రోజులు పట్టేది... సీనియర్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునేవాళ్లం..

అయితే ఐపీఎల్ వచ్చాక ఈ వాతావరణం మొత్తం చెడిపోయింది. ఇప్పటి కుర్రాళ్లు, టీమ్‌లోకి రాకముందే సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటున్నారు. సీనియర్లు అంటే భయం, భక్తి అస్సలు ఉండడం లేదు. వారితో చాలా ఫ్రెండ్లీగా కలిసి పోతున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్..
 

click me!