టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత మార్చి 17న ముంబైలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరుగుతుంది. ఆ తర్వాత మార్చి 19న వైజాగ్‌లో రెండో వన్డే, మార్చి 22న చెన్నైలో మూడో వన్డే జరుగుతాయి. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత్, ఆస్ట్రేలియా ప్లేయర్లు... ఐపీఎల్ 2023 సీజన్‌లో పాల్గొంటారు. మార్చి 29 లేదా మార్చి 31న ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం..