ఐపీఎల్‌ని బ్యాన్ చేస్తే అన్నీ సక్కబడతాయా... మరి వారి పరిస్థితి ఏంటి...

First Published Sep 30, 2022, 7:01 PM IST

ఏడాది ముందు టీమిండియా ఎప్పుడు విఫలమైనా అప్పటి భారత సారథి విరాట్ కోహ్లీపైన, హెడ్ కోచ్ రవిశాస్త్రి పైనే విమర్శలు వచ్చేవి. ఈ ఇద్దరినీ తప్పించినప్పుడే టీమిండియా, ఐసీసీ టోర్నీల్లో గెలవగలదని కామెంట్లు చేసేవాళ్లు నెటిజన్లు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరూ తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం అందరూ ఐపీఎల్‌ని టార్గెట్ చేస్తున్నారు...

bumrah

ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓడిన టీమిండియా, ఆ తర్వాత శ్రీలంక చేతుల్లోనూ ఓడి ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. టోర్నీ మధ్యలో రవీంద్ర జడేజా గాయంతో తప్పుకోగా జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాలతో ఆసియా కప్ ఆడనేలేదు...

Image credit: Getty

ఇంతకుముందుతో పోలిస్తే ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలతో భారత జట్టుకి దూరమవుతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా... ఇలా ఈ ఏడాది గాయాలతో జట్టుకి దూరమైన ప్లేయర్ల సంఖ్య, ఫిట్‌గా ఉన్న ప్లేయర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది...

K L Rahul

గాయాలతో టీమిండియాకి దూరమవుతున్న చాలా మంది ప్లేయర్లు, ఐపీఎల్‌లో మాత్రం అన్ని మ్యాచులు ఆడుతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో అన్ని మ్యాచులు ఆడిన కెఎల్ రాహుల్, గాయంతో సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ టూర్లకు దూరంగా ఉన్నాడు...

దీంతో ఐపీఎల్‌ని బ్యాన్ చేయాలని, అప్పుడు టీమిండియా... ఐసీసీ టోర్నీల్లో బాగా ఆడుతుందని అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్. నిజంగా ఐపీఎల్ బ్యాన్ చేస్తే... పరిస్థితి మారిపోతుందా? ఇంతకుముందు దేశవాళీ టోర్నీల్లో రాణించిన ప్లేయర్లను టీమిండియాకి సెలక్ట్ చేసేవాళ్లు సెలక్టర్లు...

అయితే ఇప్పుడు ఐపీఎల్ ప్రదర్శనే, టీమిండియాకి సెలక్ట్ అవ్వడానికి మార్గంగా మారింది. జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ నుంచి వరుణ్ చక్రవర్తి, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్... ఇలా భారత జట్టులోకి వచ్చినవాళ్లే...

Jasprit Bumrah

ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి వచ్చినవాళ్లు ఎంత మంది ఉన్నారో, లీగుల ద్వారా కాస్తో కూస్తో పాపులారిటీ తెచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకున్నవాళ్లు కూడా అంతేమంది ఉన్నారు. ఐపీఎల్ లేకపోతే పెద్దగా దేశవాళీ క్రికెట్ ఆడని నటరాజన్ గురించి ఎవ్వరికీ తెలిసేది కాదు...

ఇప్పుడు లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో అదరగొడుతున్న పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాస్తవ, రాహుల్ శర్మ వంటి ప్లేయర్లు... దేశవాళీ టోర్నీల్లో నిలకడగా ఏళ్ల పాటు రాణించినా విపరీతమైన పోటీ వల్ల చోటు దక్కించుకోలేక అనామకులుగా రిటైర్మెంట్ తీసుకున్నారు. ఐపీఎల్ లేకపోతే ఇలా ఎందరో క్రికెటర్లు, అనామక ప్లేయర్లుగా మిగిలిపోయేవాళ్లు...  అంతెందుకు 37 ఏళ్ల వయసులో రోహిత్ శర్మకు ఐపీఎల్‌ వల్లే కెప్టెన్సీ దక్కిందనే విషయం మరిచిపోకూడదు...

Image credit: PTI

ఐపీఎల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచులు పెరగడంతో దాదాపు రెండున్నర నెలల పాటు బిజీబిజీగా గడుపుతున్నారు క్రికెటర్లు. ఈ కారణంగా మానసికంగా, శారీరకంగా అలిసిపోయి భారత జట్టుకి ఆడాల్సిన టైమ్‌కి గాయపడుతున్నారు...

Image credit: PTI

దీనికి ఐపీఎల్‌ని బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. ఐపీఎల్‌లో భారత క్రికెటర్లు ఆడే మ్యాచుల సంఖ్యను తగ్గించి, వారిపై శారీరక ఒత్తిడి పడకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంటె బెటర్. అయితే జడేజా, కెఎల్ రాహుల్, బుమ్రా వంటి ప్లేయర్లకు కోట్లు చెల్లించే ఫ్రాంఛైజీలు, వారికి రెస్ట్ ఇచ్చేందుకు ఒప్పుకుంటాయా? అది సాధ్యమయ్యే పని కాదు..

Image credit: PTI

ఇప్పుడు జాతీయ జట్టుకి ఆడాలని కోరుకునే ప్లేయర్ల కంటే ఐపీఎల్‌ వంటి ఫ్రాంఛైజీల్లో ఆడి కోట్లు కూడబెట్టుకుంటే చాలు... అనుకునే ప్లేయర్ల సంఖ్య పెరిగింది. న్యూజిలాండ్ ప్లేయర్లు ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీశమ్ ఇలాగే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నారు...

Image credit: PTI

ఈ పరిస్థితి భారత్‌లో రాకూడదని కోరుకోవడం తప్ప, బీసీసీఐకి వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే ఐపీఎల్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదు. ఇంకా చెప్పాలంటే భారత జట్టు ఆడే మ్యాచులను చూసే జనాల కంటే ఐపీఎల్‌ని తరుచుగా ఫాలో అయ్యేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది ఇప్పుడు...

click me!