మా వాళ్లతో జాగ్రత్తగా ఆడండి! టీమిండియాకి వార్నింగ్ ఇచ్చిన పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్...

First Published Sep 9, 2023, 5:47 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్‌తో జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దయ్యింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది..

India Vs Pakistan Match

ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా 80+ స్కోర్లతో రాణించినా మిగిలిన ప్లేయర్లు అందరూ బ్యాటింగ్‌లో మూకుమ్మడిగా ఫెయిల్ అవ్వడంతో టీమిండియా 266 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను షాహీన్ ఆఫ్రిదీ అవుట్ చేస్తే, హారీస్ రౌఫ్, నసీం షా కూడా మూడేసి వికెట్లతో మెరిశారు. టీమిండియా బ్యాటర్లు అందరూ పాక్ ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లోనే అవుట్ అయ్యారు..
 

India Vs Pakistan


కొలంబోలో సెప్టెంబర్ 10న జరగాల్సిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై అందరి ఫోకస్ మళ్లింది. ఈ మ్యాచ్‌కి వచ్చిన హైప్ కారణంగా వర్షం కారణంగా ఫలితం తేలకపోతే సెప్టెంబర్ 11ని రిజర్వు డేగా కూడా కేటాయించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్..
 

Shoaib Akhtar

కొలంబోలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగడం ఇది నాలుగోసారి. 1997లో ఇక్కడ జరగాల్సిన రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. 2004 ఆసియా కప్‌లో భాగంగా కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు 59 పరుగుల తేడాతో ఓడింది.  షోయబ్ మాలిక్ బ్యాటింగ్‌లో 143 పరుగులు, బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు.  తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 300 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ 78 పరుగులు, ఇర్ఫాన్ పఠాన్ 38, సౌరవ్ గంగూలీ 39 పరుగులు, యువరాజ్ సింగ్ 28 పరుగులు చేశారు. 

ఎక్స్‌ట్రాల రూపంలో భారత జట్టుకి 38 పరుగులు అదనంగా వచ్చాయి. అయితే మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు. దీంతో 241 పరుగులకే పరిమితమైన భారత జట్టు, 59 పరుగుల తేడాతో ఓడింది..
 

‘కొలంబోలో చాలా ఏళ్ల తర్వాత ఆడబోతున్నారు. చాలా ఏళ్లకు అయినా మంచిదే. గొప్ప దేశం, గొప్ప మనుషులు. వాతావరణం కూడా బాగుంది. మా వాళ్లతో జాగ్రత్తగా ఆడండి... ’ అంటూ చెబుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు షోయబ్ అక్తర్..

గత రెండేళ్లలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 4 మ్యాచులు జరగగా రెండింట్లో పాకిస్తాన్, మరో రెండింట్లో భారత జట్టు గెలిచింది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాక్ చేతుల్లో టీమిండియా పరాజయం తర్వాత ప్రతీ పాక్ మాజీ క్రికెటర్ నోటికి వచ్చినట్టు వాగుతున్నాడని కామెంట్లు పెడుతున్నారు భారత జట్టు అభిమానులు.. 

click me!