లైంగికంగా వాడుకున్నాడు... రూ.45 లక్షలు ఇవ్వాల్సిందే... బాబర్ ఆజమ్‌కి ఆమె వార్నింగ్...

Published : Dec 26, 2020, 10:06 AM IST

పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్‌పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ... అతనిపై కేసు వాపసు తీసుకోవాలంటే రూ.45 లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. పాక్ క్రికెట్‌లో సంచలనం క్రియేట్ చేసిన  ఈ సంఘటన... మహిళ డబ్బులు డిమాండ్ చేయడంతో కీలక మలుపు తీసుకుంది.

PREV
110
లైంగికంగా వాడుకున్నాడు... రూ.45 లక్షలు ఇవ్వాల్సిందే... బాబర్ ఆజమ్‌కి ఆమె వార్నింగ్...

గత నెలలో హమీజా ముక్తర్ అనే యువతి, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై సంచలన ఆరోపణలు చేయడం పెను ప్రకంపనలు క్రియేట్ చేసింది...

210

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాబర్ ఆజమ్... ఓ అద్దె గదిలో పెట్టి, పదేళ్లు లైంగికంగా వాడుకున్నాడని... పెళ్లి చేసుకొమ్మని నిలదీస్తే గర్భవతిని చేసి వదిలేశాడని, చిత్రహింసలు పెట్టాడని తీవ్రఆరోపణలు చేసింది హమీజా ముక్తర్.

310

‘స్కూల్ నుంచే నేను, బాబర్ ఆజమ్ స్నేహితులం. అతనికి నేను చాలా రకాలుగా సాయం చేశాను. ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నప్పుడు డబ్బులు కూడా ఇచ్చాను...

410

2010లో నన్ను పెళ్లిచేసుకుంటానని చెప్పిన బాబర్ ఆజమ్, లైంగికంగా వాడుకున్నాడు. పదేళ్ల పాటు నన్ను లైంగికంగా వాడుకుని, పెళ్లి మాట ఎత్తితే చిత్ర హింసలకు గురి చేశాడు... జాతీయ జట్టుకి సెలక్టైన తర్వాత బాబర్ ఆజమ్ ప్రవర్తన మారింది’ అంటూ ఆరోపించింది హమీజా ముక్తర్.

510

26 ఏళ్ల బాబర్ ఆజమ్... పదేళ్లుగా లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కిందట 16 ఏళ్ల వయసులో ఉన్న బాబర్ ఆజమ్... ఇలాంటి పనులు ఎలా చేయగలడని ప్రశ్నించారు.

610

అయితే హమీజా ముక్తర్ ఆరోపణలతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై కేసు నమోదు చేశారు కరాచీ పోలీసులు... అయితే తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపాడేశాడు బాబర్ ఆజమ్.

710

కేవలం బాబర్ ఆజమ్ ప్రతిష్టను దెబ్బతీసి, ఆర్థికంగా లాభపడేందుకే హమీజా ఇలాంటి ఆరోపణలు చేస్తోంది కొట్టిపాడేశాడు పాక్ క్రికెట్ కెప్టెన్ తరుపు న్యాయవాది...

810

బాబర్ ఆజమ్‌పై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకునేందుకు రూ.45 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలంటూ హమీజా ముస్తాక్ కోరడం... అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

910

ఇన్నాళ్లుగా బాబర్ ఆజమ్‌పై వచ్చిన ఆరోపణల్లో అంతో కొంతో నిజం ఉందని నమ్మినవాళ్లు కూడా ఇదంతా ఉత్తిత్తి డ్రామానే అని కొట్టిపారేస్తున్నారు. బాబర్ ఆజమ్ తరుపు న్యాయవాది కూడా ముక్తర్‌కి చిల్లి గవ్వ కూడా చెల్లించేది లేదంటూ తేల్చి చెప్పేశాడు.

1010

గాయం కారణంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకి దూరమయ్యాడు బాబర్ ఆజమ్. రెండో టెస్టు సమయానికి బాబర్ ఆజమ్ కోలుకుని బరిలో దిగే అవకాశం ఉంది.

click me!

Recommended Stories