కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డు... గోల్డెన్ డకౌట్‌తో రోహిత్, విరాట్ సరసన చేరిన తిలక్ వర్మ..

Published : Aug 19, 2023, 10:20 AM IST

ఐర్లాండ్ టూర్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌, వర్షం కారణంగా పూర్తిగా సాగకపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడ్డారు. 6.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసిన టీమిండియా, 2 పరుగుల తేడాతో గెలిచి, బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ ద్వారా బుమ్రా అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు..

PREV
17
కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డు... గోల్డెన్ డకౌట్‌తో రోహిత్, విరాట్ సరసన చేరిన తిలక్ వర్మ..

కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రాకి ఇది మొట్టమొదటి టీ20 మ్యాచ్. తొలి ఓవర్‌లో 2 వికెట్లు తీసిన బుమ్రా, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో రీఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్‌గా తొలి టీ20లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన మొదటి భారత ప్లేయర్‌గా నిలిచాడు జస్ప్రిత్ బుమ్రా..
 

27
Jasprit Bumrah

కెప్టెన్‌గా మొదటి టీ20 గెలిచిన 9వ భారత కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా. ఇంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, అజింకా రహానే, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్.. టీ20 కెప్టెన్లుగా మొదటి మ్యాచ్ గెలిచారు. కేవలం విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ మాత్రమే తొలి టీ20 మ్యాచుల్లో ఓడిపోయారు..

37

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన తిలక్ వర్మ, డకౌట్ అయ్యాడు. ఐర్లాండ్‌పై డకౌట్ అయిన ఏడో భారత క్రికెటర్‌గా నిలిచాడు తిలక్ వర్మ. ఇంతకుముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్... ఐర్లాండ్‌పై టీ20ల్లో సున్నా చుట్టారు..

47

మూడో స్థానంలో గోల్డెన్ డకౌట్ అయిన మూడో భారత టీ20 ప్లేయర్ తిలక్ వర్మ. ఇంతకుముందు 2007లో సౌతాఫ్రికాతో టీ20 మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్, 2022లో ఐర్లాండ్‌పై సూర్యకుమార్ యాదవ్ మాత్రమే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యారు..

57
Jasprit Bumrah

జస్ప్రిత్ బుమ్రాకి ఇది టీ20ల్లో నాలుగో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు. ఇంతకుముందు 2017లో ఇంగ్లాండ్‌పై, అదే ఏడాది న్యూజిలాండ్‌పై, 2020లో న్యూజిలాండ్‌పై ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచాడు జస్ప్రిత్ బుమ్రా. యాదృచ్ఛికంగా ఈ మ్యాచులన్నింటికీ టీమిండియా సింగిల్ డిజిట్ తేడాతో విజయం సాధించింది..

67

వన్డే ఆరంగ్రేటం మ్యాచ్‌లో  4 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ, టీ20 ఆరంగ్రేటం మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. వన్డే, టీ20ల్లో ఆడిన తొలి మ్యాచ్‌లో రెండు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 10వ భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ..

77

ఇంతకుముందు జహీర్ ఖాన్, వినయ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రజ్ఞాన్ ఓజా, బరిందర్ స్రాన్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, టి నటరాజన్, నవ్‌దీప్ సైనీ ఈ ఫీట్ సాధించారు. 

click me!

Recommended Stories