ఇది 3 రోజుల పిచ్ కాదు, 22 రోజుల పిచ్! మీరు హ్యాపీయేనా.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్...

Published : Mar 13, 2023, 11:15 AM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో మొదటి మూడు టెస్టులు మూడు రోజుల్లోనే ముగిశాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే రెండున్నర రోజుల్లోనే ముగిసిపోయాయి. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు అయితే ఆరున్నర సెషన్లలోనే పూర్తయిపోయింది...

PREV
19
ఇది 3 రోజుల పిచ్ కాదు, 22 రోజుల పిచ్! మీరు హ్యాపీయేనా.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్...

బ్రిస్బేన్‌లో సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు రెండు రోజుల్లోనే ముగిసినప్పుడు లేవని నోర్లు, ఇండియాలో టెస్టులు మూడు రోజుల్లోనే ముగిసిపోయేసరికి తమ టీమ్‌కి అన్యాయం చేస్తున్నారని, స్పిన్ పిచ్‌లతో గెలుస్తున్నారని తెగ గగ్గోలు చేశాయి...

29

ఎప్పటిలాగే టీమిండియా, బీసీసీఐ ఆ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే నాలుగో టెస్టు జరుగుతున్న అహ్మదాబాద్ పిచ్ మాత్రం మరోలా ఉంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఐదున్నర సెషన్ల పాటు భారత బౌలర్లను విసిగించింది. ఒకనాక దశలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే, మనవాళ్లు ఆలౌట్ చేయడం అయ్యేపని కాదని అనిపించింది. 
 

39

అయితే స్పిన్‌కి ఏ మాత్రం అనుకూలించని పిచ్‌పై రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసి అదరగొట్టడంతో ఆస్ట్రేలియా 480 పరుగులకి ఆలౌట్ అయ్యింది.. రెండో రోజు చివరి సెషన్ సగం ముగిసిన తర్వాత బ్యాటింగ్‌ మొదలెట్టిన భారత జట్టు, మూడో రోజు, నాలుగో రోజు చివరి సెషన్ వరకూ బ్యాటింగ్ చేసింది... 
 

49

శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్‌గా అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ 179 ఓవర్ల దగ్గర ముగిసింది. ‘గత మూడు టెస్టుల పిచ్‌లు కేవలం రెండు రోజుల పిచ్‌లు. అయితే ఇది ఐదు రోజుల పిచ్ కాదు, 22 రోజుల పిచ్... ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు...
 

59

టీమిండియా సిరీస్ గెలవాలంటే ఆఖరి టెస్టు డ్రా చేసుకుంటే చాలు. అందుకే ఇలాంటి బ్యాటింగ్ పిచ్‌ని తయారు చేశారు. ఆఖరి టెస్టులో రిజల్ట్ వస్తుందని మేం అనుకున్నాం. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాం. అయితే ఇలాంటి పిచ్‌పై రిజల్ట్ రావడం అసాధ్యం...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా...

69

‘మొదటి మూడు టెస్టుల్లో కలిపి 7 రోజుల్లో 91 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత నాలుగు రోజుల్లో కలిపి 15 వికెట్లు మాత్రమే పడ్డాయి. ఇలాంటి పిచ్‌లపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది...’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మార్క్ వా...

79
Image credit: PTI

మార్క్ వా కామెంట్లపై కామెంటరీ బాక్సులో ఉన్న దినేశ్ కార్తీక్, రవిశాస్త్రి భిన్నంగా స్పందించాడు. ‘మరి మీకు ఎలాంటి పిచ్ కావాలి? ఇలాంటి బ్యాటింగ్ పిచ్ ఆ... లేక మూడు రోజుల్లో ముగిసిపోయే స్పిన్ పిచ్ ఆ... భారత పిచ్‌ల గురించి గగ్గోలు పెట్టిన వారంతా ఇప్పుడు సంతోషంగా ఉంటారనుకుంటా..
 

89
Image credit: PTI

మీకు ఎలాంటి పిచ్ కావాలనుకున్నారో అలాంటి పిచ్ దొరికింది. ఇక్కడ ఆస్ట్రేలియా, స్పిన్ ఆడేందుకు పెద్దగా కష్టపడడం లేదు... రిజల్ట్ వచ్చినా, రాకపోయినా పర్లేదు కదా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

99
Image credit: PTI

‘టీమిండియా కావాలనే రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసింది. వాళ్లు వేగంగా ఆడాలనుకుంటే ఇంకా చాలా ముందే ఇన్నింగ్స్ ముగిసేది. కానీ డ్రా చేసుకోవాలనే ఉద్దేశంతోనే నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. ఓవర్లు, సమయం వేస్ట్ చేశారు.. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కి వచ్చేసరికి పిచ్ బ్యాటింగ్‌కి సహకరించకూడదని ప్లాన్ వేశారు..’ అంటూ ఆరోపించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్..

Read more Photos on
click me!

Recommended Stories