జ్వరం పేరు చెప్పి ఆవేశ్ ఖాన్‌ని పక్కనబెట్టేశారు! అర్ష్‌దీప్ సింగ్‌ విషయంలో మాత్రం ఎందుకిలా?...

First Published Jan 6, 2023, 5:11 PM IST

ఒకే ఒక్క తప్పు, అంతకుమించి సాధించిన విజయాలన్నింటినీ మరిచిపోయేలా చేస్తుంది. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ క్రికెటర్లు కూడా చిన్న చిన్న తప్పులు, వైఫల్యాల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అర్ష్‌దీప్ సింగ్ అదే పొజిషన్‌లో పడ్డాడు...

ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో క్యాచ్ డ్రాప్ చేశాడు అర్ష్‌దీప్ సింగ్. ఆ సమయంలో అర్ష్‌దీప్ సింగ్‌ని టార్గెట్‌ చేస్తూ ఓ వర్గం సోషల్ మీడియాలో దాడి చేసింది. అయితే ఆ ట్రోల్స్‌ని తట్టుకుని నిలబడ్డాడు అర్ష్‌దీప్ సింగ్...

arshdeep

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా తరుపున 10 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసి భారత బౌలర్‌గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి సీనియర్లు కంటే ఎక్కువ వికెట్లు తీసి, మెరుగైన ఎకానమీతో బౌలింగ్ చేసి ఇంప్రెస్ చేశాడు...

అయితే టీ20 వరల్డ్ కప్ తర్వాత వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కొద్దికాలం టీమ్‌‌కి దూరమైన అర్ష్‌దీప్ సింగ్, బంగ్లాదేశ్ టూర్‌లో ఆడలేదు. నేరుగా శ్రీలంక సిరీస్‌కి ఎంపికయ్యాడు. అనారోగ్యం బారిన పడడంతో తొలి టీ20లో అర్ష్‌దీప్ సింగ్ ఆడలేదు.
 

రెండో టీ20లో హర్షల్ పటేల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు అర్ష్‌దీప్ సింగ్. అయితే రెండు ఓవర్లలో 5 నో బాల్స్ వేసి, ఒకే టీ20లో అత్యధిక నో బాల్స్ వేసిన భారత బౌలర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. దీంతో అర్ష్‌దీప్ సింగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది...
 

Arshdeep Singh

అర్ష్‌దీప్ సింగ్ కారణంగా టీమిండియా మరిచిపోయిన ఆవేశ్ ఖాన్‌ మరోసారి ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. ఆసియా కప్ 2022 టోర్నీలో తొలి రెండు మ్యాచుల్లో ఆడిన ఆవేశ్ ఖాన్, ఎకానమీతో బౌలింగ్‌ చేయలేకపోయాడు. దీంతో సూపర్ 4 మ్యాచులకు ముందు ఆవేశ్ ఖాన్‌ జ్వరంతో బాధపడుతున్నాడని అతన్ని తప్పించింది టీమిండియా..

Image credit: PTI

అలా టీమిండియాకి దూరమైన ఆవేశ్ ఖాన్, తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో ఆడుతూ ఇప్పటికే 22 వికెట్లు తీసుకున్నాడు. జ్వరంతో బాధపడుతున్నాడని ఆవేశ్ ఖాన్‌ని పక్కనబెట్టేసిన టీమిండియా మేనేజ్‌మెంట్, జ్వరం నుంచి పూర్తిగా కోలుకోని అర్ష్‌దీప్ సింగ్‌ని ఆడించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

Image credit: PTI

హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 41 పరుగులిచ్చినా 2 వికెట్లు తీశాడు. అతని స్థానంలో వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ మాత్రం 2 ఓవర్లలో 37 పరుగులు సమర్పించాడు. ఇందులో 5 నో బాల్స్ వేశాడు. ఈ నో బాల్స్‌ని క్యాష్ చేసుకున్న శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం అందుకుంది.. 

click me!