నన్ను ఔట్ చేయలేక ఏడ్చేవాడు, అందుకే ఇలాంటి మాటలు... షేన్ వార్న్‌కి సలీం మాలిక్ కౌంటర్...

First Published Jan 19, 2022, 1:29 PM IST

పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్, తనకి లంచం ఇవ్వాలని ప్రయత్నించాడని ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తనపై చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించాడు సలీం మాలిక్..

‘ఓ మాజీ క్రికెటర్ తన బుక్‌ని, లేదా బయోగ్రఫీని లేదా మరేదైనా లాంఛ్‌ చేసినప్పుడు వాళ్లు కొన్ని వివాదాలు క్రియేట్ చేయాలని చూస్తారు. ఆ వివాదాలు వాటికి కావాల్సినంత పబ్లిసిటీ తెస్తాయనే చీప్ స్టంట్ ఇది...

26 ఏళ్ల తర్వాత కరాచీ టెస్టులో లంచం ఇవ్వాలని ప్రయత్నించానని చెప్పడం కూడా అలాంటిదే. అదే నిజమైతే ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు. ఇప్పటిదాకా తమ బయోగ్రఫీ అమ్ముకోవాలని చూసి ప్రతీ క్రికెటర్ ఇదే ఫాలో అయ్యాడు...

షేన్ వార్న్ కామెంట్లలో అది తప్ప, మరో ఉద్దేశం కనిపించడం లేదు. 26 ఏళ్ల తర్వాత అతను, నన్ను గుర్తుచేసుకున్నాడంటే సంతోషమే...

అతను నన్ను ఔట్ చేయలేక ఎప్పుడూ ఏడ్చేవాడు. అతను ఆ కోపమంతా కలిసి ఇలా బయటికి వచ్చిందేమో... ’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్...

టెస్టు క్రికెట్‌లో 708 వికెట్లు తీసిన షేన్ వార్న్, పాకిస్తాన్‌పై 90 వికెట్లు తీశాడు. ఇందులో ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌పై 45 వికెట్లు తీయగా, పాకిస్తాన్‌లో 18, యూఏఈలో 16, శ్రీలంకలో 11 వికెట్లు తీశాడు...

తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 1994లో జరిగిన ఓ సంఘటన గురించి బయటపెట్టాడు షేన్ వార్న్... ‘1994లో నేను, టీమ్ మే కలిసి పాకిస్తాన్‌లో టెస్టు సిరీస్ ఆడేందుకు కరాచీలో హోటల్ రూమ్‌లో ఉన్నాం...

అప్పుడు పాక్ కెప్టెన్ మాలిక్ మాకు ఫోన్ చేశాడు, నిన్ను కలవాలని చెప్పాడు. అప్పటికీ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ముగిసింది. మేం మరో 7 వికెట్లు తీస్తే మ్యాచ్ గెలుస్తాం...

ఆఖరి రోజు పాకిస్తాన్ గెలవాలంటే మరో 160 పరుగులు కావాలి. మేం ఈజీగా గెలుస్తామనే ధీమాతో ఉన్నాం. పిలిచాడు కదా అని అతని గదికి వెళ్లాను...

‘మ్యాచ్ బాగా జరుగుతోంది కదా’ అన్నాడు. నేను ‘అవును, మేం రేపు గెలిచేలా ఉన్నాం...’ అన్నాను. ‘అవును... మేం ఓడిపోలేం, పాకిస్తాన్‌లో మేం మ్యాచ్ ఓడిపోతే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు..

మా ఇళ్లను కూల్చేస్తారు. మా కుటుంబాల ఇళ్లను తగులబెట్టేస్తారు... నాకేం చెప్పాలో తెలియడం లేదు... ’ అంటూ నాకు 2 మిలియన్ డాలర్లు ఇవ్వడానికి ప్రయత్నించాడు...

వికెట్లు తీయకుండా స్టంప్స్ దూరంగా బంతులు వేయాలని కోరాడు. నేను ఒక్కసారి షాక్ అయ్యాను. నేను అతన్ని తిట్టి, మేం మిమ్మల్ని ఓడించి తీరతాం...’ అని చెప్పి వెళ్లిపోయాను...’ అంటూ కామెంట్ చేశాడు షేన్ వార్న్...

click me!