ఆస్ట్రేలియా వారి ప్లేస్‌లో ఆడుతున్నారుగా... మాకూ వాళ్లకీ అదే తేడా... విరాట్ కోహ్లీ కామెంట్...

First Published Nov 30, 2020, 6:55 PM IST

INDvsAUS: ఆస్ట్రేలియా పర్యటనను వరుసగా రెండు ఓటములతో ప్రారంభించింది టీమిండియా. మొదటి రెండు వన్డేల్లోనూ ప్రత్యర్థికి భారీ స్కోరు అప్పగించి, చేధనలో విఫలమైంది భారత జట్టు. బ్యాట్స్‌మెన్ పోరాడినా, బౌలర్లు చేతులు ఎత్తేయడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లు సాధించారు. తాజాగా రెండో వన్డే ఓటమి అనంతరం ఆస్ట్రేలియా విజయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.

మొదటి రెండు వన్డేల్లోనూ టాస్ ఓడి, మొదట బౌలింగ్ చేసింది టీమిండియా. సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగిన రెండు వన్డేల్లోనూ ఆస్ట్రేలియా ఓపెనర్లు శతాధిక భాగస్వామ్యం నెలకొల్పడం, భారత బౌలర్లు విఫలం కావడం కామన్ విషయం.
undefined
మొదటి వన్డేల్లో 374 పరుగులు ఇచ్చిన భారత బౌలర్లు, రెండో వన్డేలో మరో 15 పరుగులు అధికంగానే ఇచ్చారు... భారత బ్యాట్స్‌మెన్ పోరాడినా విజయం మాత్రం దక్కలేదు...
undefined
‘ఆస్ట్రేలియా పిచ్, వాతావరణ పరిస్థితులు వారికి బాగా తెలుసు. వికెట్ రావాలంటే ఎక్కడ బౌలింగ్ చేయాలో వారికి తెలిసినట్టుగా మాకు ఇంకా తెలీదు... వాళ్లు ఆ అవకాశాలను సృష్టించుకున్నారు...
undefined
సొంత మైదానంలో ఆడితే ఉండే అడ్వాంటేజ్ వారికి బాగా హెల్ప్ అయ్యింది. భారత బౌలర్లు ఇంకా ఇక్కడి పరిస్థితులకు అలవాటు కాలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్లు బౌలింగ్ చేసినట్టు, మేం చేయలేకపోయాం...
undefined
ఆస్ట్రేలియా విజయానికి, టీమిండియా ఓటమికి మధ్య తేడా అదే... లక్ష్యచేధనలో మేం బాగానే పోరాడాం. 390 పరుగుల టార్గెట్ చేధించాలంటే అంత తేలికయ్యే పని కాదు... విజయానికి దగ్గరగా రాగలిగాం...
undefined
కానీ కీలక సమయంలో నేను, కెఎల్ రాహుల్ అవుట్ కావడంతో విజయం ఆస్ట్రేలియాకి దక్కింది... ఆఖరి 10 ఓవర్లలో 100 పరుగుల టార్గెట్ ఉన్నా ఈజీగా కొట్టేయవచ్చని భావించాం...
undefined
అయితే కొంచెం ముందుగానే నేను, రాహుల్ అవుట్ కావడం, హార్ధిక్ పాండ్యా తడబాటు... ఆస్ట్రేలియాకి విజయాన్ని అందించాయి... ’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.
undefined
వెన్నెముక ఆపరేషన్ అయితే ఏడాది తర్వాత బౌలింగ్ చేసిన హార్ధిక్ పాండ్యా.. బాగా బౌలింగ్ చేశాడని, అందుకే అతనితో నాలుగు ఓవర్లు వేయించామని చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ...
undefined
click me!