ఇప్పుడున్నవారిలో టాప్ 5 బెస్ట్ బౌలర్లు వీరే... భారత్ నుంచి ముగ్గురు, కానీ బుమ్రాకి దక్కని చోటు...

Published : Jun 06, 2021, 04:20 PM IST

ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్... ప్రస్తుత తరంలో ది బెస్ట్ టాప్ 5 బౌలర్లను ప్రకటించాడు. తన దృష్టిలో వీళ్లే, అత్యుత్తమ బౌలర్లు వీరేనంటూ ఐదుగురి ప్లేయర్లను ప్రకటించాడు. చాపెల్ లిస్టులో ముగ్గురు భారత బౌలర్లకు చోటు దక్కగా, ఓ ఆస్ట్రేలియా బౌలర్, ఓ దక్షిణాఫ్రికా బౌలర్‌కీ చోటు దక్కింది...

PREV
19
ఇప్పుడున్నవారిలో టాప్ 5 బెస్ట్ బౌలర్లు వీరే... భారత్ నుంచి ముగ్గురు, కానీ బుమ్రాకి దక్కని చోటు...

టాప్ 5 కగిసో రబాడా: సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా, ప్రస్తుత తరంలో ఉన్న బెస్ట్ బౌలర్లలో ఒకడంటూ ప్రశంసించాడు ఇయాన్ చాపెల్. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 8 టెస్టులు ఆడిన కగిసో రబాడా, 26 వికెట్లు తీశాడు. అయితే అనేక వివాదాల్లో ఇరుక్కున్న సఫారీ క్రికెట్ జట్టు, ప్రస్తుతం వరుస ఓటములను ఎదుర్కుంటోంది.

29

టాప్ 4 మహ్మద్ షమీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో గాయపడి, సిరీస్ మొత్తానికి దూరమైన మహ్మద్ షమీ... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 10 టెస్టులు ఆడి 36 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్‌లో కూడా షమీ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.

39

టాప్ 3 ఇషాంత్ శర్మ: భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, గాయం కారణంగా ఆస్ట్రేలియా టూర్ మొత్తానికి దూరమయ్యాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 300 టెస్టు వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. 

49

‘2018 నుంచి ఇషాంత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతని గణాంకాలు చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. 2018 నుంచి ఇప్పటిదాకా 22 టెస్టుల్లో 77 వికెట్లు తీశాడు ఇషాంత్ శర్మ’ అంటూ చెప్పుకొచ్చాడు ఇయాన్ చాపెల్... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 11 టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మ 36 వికెట్లు పడగొట్టాడు.

59

టాప్ 2 ప్యాట్ కమ్మిన్స్: ఆస్ట్రేలియా టెస్టు పేసర్, నెం.1 టెస్టు బౌలర్ ప్యాట్ కమ్మిన్స్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 

69

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో 14 మ్యాచులు ఆడిన ప్యాట్ కమ్మిన్స్, 70 వికెట్లు పడగొట్టాడు. టీమిండియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 21 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు కమ్మిన్స్...

79

టాప్ 1 రవిచంద్రన్ అశ్విన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 13 మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 67 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. 

89

17 మ్యాచుల్లో 69 వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్, 14 మ్యాచుల్లో 70 వికెట్లు తీసిన ప్యాట్ కమ్మిన్స్ అతని కంటే ముందున్నారు. అయితే ఈ ఇద్దరూ ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకోగా... అశ్విన్ ఫైనల్‌ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు.

99

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 9 మ్యాచులు ఆడి 34 వికెట్లు తీసిన భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకి ఇయాన్ చాపెల్, బెస్ట్ బౌలర్ల జాబితాలో చోటు దక్కలేదు. 14 మ్యాచుల్లో 56 వికెట్లు తీసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ని ఆరో బెస్ట్ బౌలర్‌గా పేర్కొన్నాడు ఇయాన్ చాపెల్. 

click me!

Recommended Stories