David Warner retirement Twist: క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కొత్త సంవత్సరం వేళ అందిరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పటికే టెస్టు ఫార్మట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించగా, తాజాగా వన్డే క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశాడు.
సోమవారం తన రిటైర్మెంట్ గురించి మాట్లాడిన వార్నర్.. ''వన్డే క్రికెట్ నుంచి కూడా తప్పకుండా రిటైర్ అవుతున్నాను. ప్రపంచకప్ సమయంలో నేను చెప్పిన మాట.. దాన్ని అధిగమించి, భారత్ లో గెలవడం గొప్ప విజయంగా భావిస్తున్నా'' అని తెలిపాడు.
David Warner
కొత్త సంవత్సరం రోజున డేవిడ్ వార్నర్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. క్రికెట్ ప్రియులకు నిరాశను కలిగించింది. అయితే, వార్నర్ తన రిటైర్మెంట్ గురించి చెబుతూనే ట్విస్టు ఇచ్చాడు.
టెస్టులతో పాటు వన్డే ఫార్మట్ నుంచి రిటైర్ కావాలని తాను ఈ రోజు నిర్ణయం తీసుకున్నాని చెప్పిన డేవిడ్ వార్నర్.. ఈ నిర్ణయం తనను ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని లీగ్లు ఆడేందుకు, వన్డే జట్టును కాస్త ముందుకు నడిపించడానికి వీలు కల్పిస్తుందని తెలిపాడు. అలాగే, "ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతోందని నాకు తెలుసు. రెండేళ్లలో నేను మంచి క్రికెట్ ఆడుతూ ఉంటే, వారికి ఎవరైనా అవసరం ఉంటే, నేను అందుబాటులో ఉంటానని" చెప్పాడు.
David Warner
అంటే డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టెస్టు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా.. అతను ఛాంపియన్స్ ట్రోఫీలో కనిపించే అవకాశముంది. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా జట్టుకు అవసరమైతే తప్పకుండా తన సేవలు అందిస్తానని వార్నర్ స్పష్టం చేశాడు.
తాజా రిటైర్మెంట్ నిర్ణయంతో వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా డేవిడ్ వార్నర్ తన కెరీర్ ను ముగించాడు. 161 మ్యాచ్ లలో 45.30 సగటుతో 97.26 స్ట్రైక్ రేట్ లో 6932 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతను చేసిన 22 సెంచరీలు ఆస్ట్రేలియా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (29 ) వార్నర్ కంటే ముందున్నాడు.