కఢక్‌నాథ్ కోళ్లకు క్రేజ్ పెంచేసిన మహేంద్ర సింగ్ ధోనీ... తెలుగు రాష్ట్రాల్లో నల్లకోడికి...

Published : Mar 04, 2021, 12:43 PM ISTUpdated : Mar 04, 2021, 01:32 PM IST

‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తాను...’ ఈ ఫేమస్ డైలాగ్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సరిగ్గా సెట్ అవుతుంది. జుంపాల జుట్టు నుంచి, రకరకాల హెయిర్ స్టైల్స్‌తో యూత్‌కి ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయిన మహేంద్ర సింగ్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సేంద్రీయ వ్యవసాయంపై పూర్తి ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. క్రికెట్ ఫీల్డ్‌లోనే కాదు, మార్కెటింగ్ ఫీల్డ్‌లో కూడా ట్రెండ్ సెట్టర్‌గా మారాడు మాహీ...

PREV
17
కఢక్‌నాథ్ కోళ్లకు క్రేజ్ పెంచేసిన మహేంద్ర సింగ్ ధోనీ... తెలుగు రాష్ట్రాల్లో నల్లకోడికి...

కఢక్‌నాథ్ చికెన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నల్లగా నిగనిగలాడే కఢక్‌నాథ్ కోడి, అనేక పోషకాల నిలయం. కొవ్వు తక్కువగా, రుచి ఎక్కువగా ఉండే నల్ల కోడి, దేశంలో మధ్యప్రదేశ్ లాంటి కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితమై ఉండేది...

27

కఢక్‌నాథ్ కోడిని రెండేళ్ల క్రితమే మార్కెట్లో‌కి తీసుకొచ్చారు తెలుగు రైతులు. అయితే అప్పట్లో ఈ నల్ల కోడిని ఎవ్వరూ పట్టించుకోలేదు. కిలో 800 రూపాయలకు పైగా ఉండడంతో ఈ చికెన్‌కి తగినంత పబ్లిసిటీ రాలేదు. అయితే ధోనీ ఈ బిజినెస్‌లో ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది. 

37

రాంఛీలోని తన ఫామ్‌లో కఢక్‌నాథ్ కోళ్లను పెంచాలని నిర్ణయించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, 2 వేల కోడి పిల్లలను మధ్యప్రదేశ్ నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. ఈ కోడిని దేశంతో పాటు యూఏఈలోని మార్కెట్లలో విక్రయించాలని భావిస్తున్నాడు మాహీ భాయ్...

47

ధోనీ కఢక్‌నాథ్ కోళ్ల వ్యాపారం మొదలెట్టబోతున్నాడనే వార్త రావడంతో ఒక్కసారి నల్లకోడి రాత మారిపోయింది. కఢక్‌నాథ్ కోళ్ల గురించి గూగుల్ చేసి మరీ తెలుసుకున్న ఆయన అభిమానులు, ఈ కోడిని ఇష్టంగా కొనుగోలు చేసి తింటున్నారట...

57

దీంతో రెండేళ్ల కిందట ఎవ్వరూ పట్టించుకోని కఢక్‌నాథ్ కోడికి ఇప్పుడు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. బర్డ్ ఫ్లూ భయంతో బాయిలర్ కోడిని పక్కనబెట్టిన చికెన్ ప్రియులు, ఈ గిరిజన ప్రాంత కోడిని ఇష్టంగా ఆరగించేస్తున్నారు. దీంతో నల్ల కోడి మాంసం కిలో రూ.1000 నుంచి రూ.1200 దాకా పలుకుతోంది. 

67

నల్లకోడి గుడ్డుకి కూడా మంచి డిమాండ్ భారీగా ఏర్పడింది. ఒక్కో గుడ్డును రూ.50 లకు అమ్ముతున్నారు వ్యాపారులు. కాఫీ రంగులో, పింక్ రంగులో ఉండే కఢక్‌నాథ్ కోడి గుడ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతున్నాయి...

77

ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత పూర్తిగా బిజినెస్, సేంద్రీయ వ్యవసాయం మీద మాత్రమే దృష్టి పెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2021 సీజన్ కోసం మార్చి 11 కోసం ప్రాక్టీస్ మొదలెట్టబోతున్నాడు...

click me!

Recommended Stories