వామ్మో మార్కస్... ఇదేం పోస్ట్! మహిళల ఆ భాగాన్ని పోలి ఉందంటూ షాకింగ్ పోస్ట్ చేసిన స్టోయినిస్...

Published : Jul 25, 2022, 04:49 PM IST

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ కాస్త తేడా! అవును... మనోడి చేష్టల గురించి బాగా తెలిసినవారంతా అతను ఎంత తేడానో బాగా చెప్పేస్తారు. ఆసీస్ యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాతో రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలిచిన స్టోయినిస్.. 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత షూస్‌లో షాంపైన్ పోసుకుని తాగి వింత సెలబ్రేషన్స్‌తో పాపులారిటీ తెచ్చుకున్నాడు...

PREV
17
వామ్మో మార్కస్... ఇదేం పోస్ట్! మహిళల ఆ భాగాన్ని పోలి ఉందంటూ షాకింగ్ పోస్ట్ చేసిన స్టోయినిస్...

ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆడమ్ జంపా, మార్కస్ స్టోయినిస్ చేసిన చేష్టలు చూసి వీళ్లిద్దరూ కచ్చితంగా ‘గేస్’ అని అనుకున్నారంతా. అయితే ఆడమ్ జంపా, గత ఏడాది ఐపీఎల్ ముందు పెళ్లి చేసుకోగా... స్టోయినిస్ కూడా అప్పుడెప్పుడో తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు...

27

తాజాగా తన గర్ల్‌ఫ్రెండ్ స్టీఫనీ ముల్లర్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మార్కస్ స్టోయినిస్. గర్ల్‌ఫ్రెండ్‌తో ఫోటో దిగడం, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం పెద్ద వింతేమీ కాదు.. 
 

37

అయితే స్టోయినిస్ ఆ ఫోటోలతో ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీ, హాట్ టాపిక్ అయ్యింది. గర్ల్‌ఫ్రెండ్ పక్కన షర్ట్ లేకుండా ఫోజు ఇచ్చిన స్టోయినిస్, తన చేతుల కింది భాగాన్ని జూమ్ చేసి చూపిస్తూ రెండు ఫోటోలను స్టోరీలో షేర్ చేశాడు...

47

ఆ ఫోటోలను సరిగ్గా గమనిస్తూ మహిళల శృంగార భాగాన్ని పోలి ఉన్నట్టు అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ల కోసం ‘అక్కడేముందో మీకు కనిపిస్తోందా...’ అంటూ కాప్షన్ కూడా జోడించాడు మార్కస్ స్టోయినిస్...

57

సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉండే స్టీఫెనీ ముల్లర్ హాట్ హాట్ ఫోజుల్లో ఉన్న ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది.... స్టోయినిస్ కూడా ముల్లర్‌తో గడిపిన మధుర క్షణాలను ఏ మాత్రం మొహమాటం లేకుండా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటాడు.

67

అంతా బాగానే ఉన్నా ఓ అంతర్జాతీయ క్రికెటర్ అయి ఉండి, ఇలాంటి పోస్టులు చేయడం సమంజసం కాదని, ప్రస్తుత తరంలో చాలామంది పిల్లలు కూడా సోషల్ మీడియాని వాడుతున్నారనే విషయాన్ని కూడా స్టోయినిస్ మరిచిపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు నెటిజన్లు...

77

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకి ఆడిన మార్కస్ స్టోయినిస్‌ని రూ.9 కోట్ల 20 లక్షల భారీ మొత్తానికి డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్...

click me!

Recommended Stories