IND vs PAK: భారత్ vs పాక్ ఫైనల్ వర్షంతో రద్దైతే గోల్డ్ మెడల్ అందుకునేది ఎవరు? ఈ రూల్స్ తెలుసా?

Published : Oct 02, 2026, 02:30 PM IST

India vs Pakistan: ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్ పోరులో భారత్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే, భారత్ పాక్ ఫైనల్ వర్షంతో రద్దైతే గోల్డ్ మెడల్ అందుకునేది ఎవరు? రూల్స్ ఏం చెబుతున్నాయి?

PREV
16
IND vs PAK: ఆసియా గేమ్స్ 2026లో భారత్ పాకిస్థాన్ బిగ్ ఫైట్

ఐచి-నాగోయాలో జరిగే 2026 ఆసియా గేమ్స్ పురుషుల క్రికెట్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగబోయే హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ వర్షం లేదా మరేదైనా వాతావరణ సమస్యల వల్ల పూర్తిగా రద్దైతే సరికొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఆసియా గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ (NAGOC) వెల్లడించిన కొత్త నిబంధనల ప్రకారం, మ్యాచ్ రద్దైతే భారత్, పాకిస్థాన్ రెండు జట్లకు సంయుక్తంగా గోల్డ్ మెడల్ ఇస్తారు. ఈ నిర్ణయం క్రీడాభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత టోర్నీలతో పోలిస్తే ఈసారి రూల్స్‌లో ఆర్గనైజర్లు భారీ మార్పులు చేశారు.

26
వర్షంతో మ్యాచ్ ఆగితే జాయింట్ గోల్డ్ మెడలిస్ట్స్

ఒకవేళ భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే గోల్డ్ మెడల్ ఫైట్ వర్షార్పణమై ఎలాంటి ఫలితం తేలకుంటే, రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఈ ప్రత్యేక పరిస్థితిలో విజేతగా నిలిచిన రెండు జట్లకు గోల్డ్ మెడల్స్ ఇస్తారు తప్ప, ఆ విభాగంలో ఎవరికీ సిల్వర్ మెడల్ ఇవ్వరు.

ఒకవేళ ఇదే జరిగితే పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టుకు ఆసియా గేమ్స్ చరిత్రలో ఇది తొలి గోల్డ్ మెడల్ అవుతుంది. అలాగే భారత్ తన ఛాంపియన్ హోదాను నిలబెట్టుకున్నట్లు అవుతుంది.

36
ఫలితం తేల్చేందుకు అంపైర్ల చివరి ప్రయత్నాలు ఏంటి?

మ్యాచ్ పూర్తిగా రద్దైందని ప్రకటించడానికి ముందు గ్రౌండ్ సిబ్బంది, అంపైర్లు ఎలాగైనా విజేతను తేల్చడానికి కొన్ని కీలక చర్యలు తీసుకుంటారు. ముందుగా ఓవర్ల సంఖ్యను తగ్గించి మ్యాచ్ జరిపేందుకు ప్రయత్నిస్తారు. డక్ వర్త్ లూయిస్ పద్ధతి వర్తించాలన్నా రెండు జట్లూ కనీసం 5 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది.

ఇక 5 ఓవర్ల మ్యాచ్ కూడా కుదరని పరిస్థితి వస్తే, సూపర్ ఓవర్ నిర్వహించేందుకు అవకాశం ఉందో లేదో చూస్తారు. సూపర్ ఓవర్ సాధ్యమైతే అందులో గెలిచిన జట్టుకే సింగిల్ గోల్డ్ దక్కుతుంది. ఈ క్రికెట్ మెడల్ మ్యాచ్‌లకు ఎలాంటి రిజర్వ్ డేలు లేవు. గ్రౌండ్ ఆడేందుకు అస్సలు అనుకూలించకపోతే మాత్రమే మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేసి సంయుక్త విజేతలను ప్రకటిస్తారు.

46
2023 హాంగ్‌జౌ టోర్నీకి, 2026 నాగోయాకు తేడా ఏంటి?

2023లో జరిగిన హాంగ్‌జౌ ఆసియా గేమ్స్‌తో పోలిస్తే 2026 నిబంధనలలో పెద్ద మార్పు వచ్చింది. 2023 ఫైనల్లో భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. ఆ సమయంలో ఉన్న రూల్స్ ప్రకారం టోర్నీ ప్రారంభానికి ముందు ఉన్న ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లేదా సీడింగ్ ఆధారంగా భారత్‌కు నేరుగా గోల్డ్ మెడల్ కేటాయించారు. అఫ్గానిస్థాన్‌కు సిల్వర్ మెడల్ ఇచ్చారు.

కానీ, 2026 ఐచి-నాగోయా టోర్నీలో ఈ సీడింగ్ పద్ధతిని ఫైనల్ మ్యాచ్‌లకు స్వస్తి చెప్పారు. ఫైనల్ రద్దైతే సీడింగ్‌తో సంబంధం లేకుండా ఇరు జట్లకూ గోల్డ్ ఇవ్వాలని స్పష్టంగా నిర్ణయించారు.

56
క్వార్టర్స్, సెమీఫైనల్స్, బ్రాంజ్ మెడల్ మ్యాచ్ రూల్స్

ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రమే జాయింట్ గోల్డ్ నిబంధన తెచ్చిన ఆర్గనైజర్లు, నాకౌట్ దశలోని మిగతా మ్యాచ్‌లకు మాత్రం పాత సీడింగ్ రూల్‌‌నే కొనసాగిస్తున్నారు. క్వార్టర్ ఫైనల్స్ లేదా సెమీఫైనల్స్ వర్షం వల్ల రద్దైతే, ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్‌లో ముందు వరుసలో ఉన్న జట్లే తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.

అయితే మూడో స్థానం కోసం జరిగే బ్రాంజ్ మెడల్ మ్యాచ్ వర్షంతో రద్దైతే మాత్రం, సెమీఫైనల్లో ఓడిన ఆ రెండు జట్లకు సంయుక్తంగా బ్రాంజ్ మెడల్ ఇస్తారు.

66
ఆసియా గేమ్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయం

ఆసియా గేమ్స్ చరిత్రలో పురుషుల క్రికెట్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ ముఖాముఖి తలపడటం ఇదే తొలిసారి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద క్రీడా సంబరంలో ఈ దాయాదుల పోరు కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భారత జట్టు ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. వాతావరణం అనుకూలించి పూర్తి స్థాయి పోరు జరిగితే ఎవరు గోల్డ్ కొడతారో తేలుతుంది. ఒకవేళ వర్షం వచ్చి ఒక్క బంతి పడకుండా మ్యాచ్ రద్దు అయితే రెండు దేశాలకు గోల్డ్ మెడల్ అందిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories