ఆసియా కప్ 2023: సూపర్ 4 మ్యాచుల షెడ్యూల్ ఇదే... కొలంబోలో తగ్గని వర్షాలు, అయినా...

Published : Sep 06, 2023, 02:50 PM IST

ఆసియా కప్ 2023 గ్రూప్ మ్యాచులు ముగిశాయి. గ్రూప్ A నుంచి ఇండియా, పాకిస్తాన్ సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించగా, గ్రూప్ బీ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక క్వాలిఫై అయ్యాయి. గ్రూప్ బీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ పోరాడినా 2 పరుగుల తేడాతో ఓడింది..

PREV
17
ఆసియా కప్ 2023: సూపర్ 4 మ్యాచుల షెడ్యూల్ ఇదే... కొలంబోలో తగ్గని వర్షాలు, అయినా...

2018, 2022, 2023 మూడు సీజన్లలో గ్రూప్ ఏ నుంచి ఇండియా, పాకిస్తాన్ సూపర్ 4 రౌండ్‌కి వచ్చాయి. అయితే గ్రూప్ బీలో మాత్రం మూడు సీజన్లలో వేర్వేరు జట్లు సూపర్ 4 రౌండ్‌కి వచ్చాయి. 2018 ఆసియా కప్‌లో ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్.. సూపర్ 4 రౌండ్‌కి వచ్చాయి.

27

2022 ఆసియా కప్‌లో ఆఫ్ఘానిస్తాన్, శ్రీలంక సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించాయి. 2023 ఆసియా కప్‌లో గ్రూప్ బీ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక అర్హత సాధించాయి. అలాగే గత రెండు సీజన్లలో ఫైనల్ ఆడిన జట్లు కూడా వేరు...

37

2018 ఆసియా కప్ ఫైనల్‌లో ఇండియా, బంగ్లాదేశ్ తలబడ్డాయి. టీమిండియ విజేతగా నిలిచింది. 2022 ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్తాన్, శ్రీలంక తలబడ్డాయి. శ్రీలంక విజేతగా నిలిచింది..

47

సెప్టెంబర్ 6న లాహోర్‌లో పాకిస్తాన్ - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ తర్వాత 2 రోజుల బ్రేక్ దొరుకుతుంది. టీమ్స్ అన్నీ కొలంబో చేరుకుంటాయి. సెప్టెంబర్ 9న బంగ్లాదేశ్ -శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది..

57

సెప్టెంబర్ 10న ఇండియా -పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత 11 తేదీ బ్రేక్ తీసుకుని, 12న శ్రీలంకతో మ్యాచ్ ఆడుతుంది టీమిండియా. సెప్టెంబర్ 14న శ్రీలంక- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. సెప్టెంబర్ 15న ఇండియా - బంగ్లాదేశ్ మధ్య ఆఖరి సూపర్ 4 మ్యాచ్ జరుగుతుంది..
 

67

సూపర్ 4 స్టేజీలో టాప్ 2లో నిలిచిన రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కొలంబోలో ఇప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

77

వర్షాల కారణంగా కొలంబో నుంచి హంబన్‌తోటకి మ్యాచులను మార్చాలని భావించినా, దానికి పాకిస్తాన్‌ అంగీకరించలేదు. మ్యాచ్‌లకు మరో 3 రోజుల సమయం ఉండడంతో వర్షాలు తగ్గుతాయని భావిస్తోంది ఆసియా క్రికెట్ కౌన్సిల్.. 

click me!

Recommended Stories