మాకు ఆ లెక్కలు చెప్పి ఉంటే, ఈజీగా గెలిచి ఉండేవాళ్లం.. ఆఫ్గాన్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..

First Published | Sep 6, 2023, 2:21 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించడం కోసం సాగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్, 2 పరుగుల తేడాతో పోరాడి ఓడింది...

Rashid Khan

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ 37.2 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించి ఉంటే, సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించి ఉండేది.

Mohammad Nabi

మహ్మద్ నబీ 32 బంతుల్లో 65 పరుగులు చేసి, వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ఆఫ్ఘాన్ బ్యాటర్‌గా నిలిచాడు. కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 59, రహ్మత్ షా 45 పరుగులు చేసి పోరాడడంతో 37 ఓవర్లు ముగిసే సమయానికి 289 పరుగులు చేసింది ఆఫ్ఘాన్...


10 బంతుల్లో 16 పరుగులు కావాల్సినప్పుడు నజీబుల్లా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో సింగిల్ కూడా రాలేదు. 37వ ఓవర్‌లో రషీద్ ఖాన్ 3 ఫోర్లు బాది 12 పరుగులు రాబట్టాడు. అయితే 38వ ఓవర్‌లో మొదటి బంతికే గెలవాలనే కంగారు... ఆఫ్ఘానిస్తాన్ ఓటమికి కారణంగా మారింది. 
 

38వ ఓవర్ మొదటి బంతికి 3 పరుగులు చేయాల్సి ఉండగా ముజీబ్ వుర్ రహీం భారీ షాట్‌కి ప్రయత్నించి, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ముజీబ్ సింగిల్ తీసి, రషీద్ ఖాన్‌కి స్ట్రైయిక్ ఇచ్చి ఉంటే... ఆ తర్వాత 5 బంతుల్లో సిక్సర్ బాదినా ఆఫ్ఘాన్... సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించి ఉండేది..
 

Afghanistan

అయితే ఈ విషయం ఆఫ్ఘాన్‌కి తెలియకపోవడం వల్లే 38 ఓవర్‌లో మొదటి బంతికి సిక్సర్ బాదాలని ప్రయత్నించి ముజీబ్, ఆ తర్వాత ఫజల్ హక్ ఫరూకీ అవుట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆఫ్ఘాన్ హెడ్ కోచ్ జొనాథన్ ట్రాట్...
 

‘37.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే... సూపర్ 4 రౌండ్‌కి చేరవచ్చని మాత్రమే మాకు చెప్పారు. 38.1 ఓవర్ల వరకూ 295 లేదా 297 కొట్టినా  క్వాలిఫై కావచ్చని చెబితే, ఇలా ఓడేవాళ్లం కాదు. మాకు ఈ సమాచారం ఇవ్వలేదు. అందుకే మిస్ కమ్యూనికేషన్‌తో వికెట్లు కోల్పోయాం..’ అంటూ కామెంట్ చేశాడు జొనాథన్ ట్రాట్..
 

Latest Videos

click me!