పాక్‌తో మ్యాచ్‌ ఓడినందుకు ఆ ఫ్యాన్స్ హ్యాపీ... కోహ్లీ కెప్టెన్సీనే ట్రోల్ చేస్తారా అంటూ పోస్టులు...

First Published Sep 6, 2022, 5:23 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీ మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయాన్ని అందుకున్న భారత జట్టు, సూపర్ 4 రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో మాత్రం 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమికి అనేక కారణాలున్నాయి...

భారత ఫీల్డర్లు చేసిన అనవసర తప్పిదాలతో పాటు భారత బౌలర్లు యజ్వేంద్ర చాహాల్, హార్ధిక్ పాండ్యా ధారాళంగా పరుగులు సమర్పించారు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్, 19వ ఓవర్‌లో ఏకంగా 19 పరుగులు సమర్పించాడు...

Pakistan Team

ఐపీఎల్ 2022లో డెత్ ఓవర్లలో ఒక్క సిక్సర్ కూడా ఇవ్వకుండా అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ సింగ్, ఓ ఈజీ క్యాచ్‌ని డ్రాప్ చేసి... టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడిగా అభిమానుల నుంచి తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు...

అయితే పాక్ చేతుల్లో ఎదురైన ఈ ఓటమిపై కొందరు టీమిండియా ఫ్యాన్స్‌కి హ్యాపీ ఫీలవుతున్నారట. కారణం టీ20 వరల్డ్ కప్ 2021. గత ఏడాది యూఏఈలో జరిగిన పొట్టి ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని చవి చూసింది భారత జట్టు...

ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్ చేతుల్లో టీమిండియాకి ఎదురైన మొట్టమొదటి పరాజయం ఇదే. ఈ మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో ఆదుకుని, భారత జట్టు 150+ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించినా... బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు...

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమికి విరాట్ కోహ్లీ చెత్త కెప్టెన్సీయే కారణమని ట్రోల్స్ వినిపించాయి. తాజాగా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచి, షార్ట్ టైమ్‌లోనే టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శర్మ కూడా పాక్‌ చేతుల్లో పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది..

విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అని అతని ఐపీఎల్ రికార్డులు చూసి టీమిండియా కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ. అయితే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ చేసిన కొన్ని తప్పులు కూడా టీమిండియా ఓటమికి కారణమయ్యాయి...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆరో బౌలింగ్ ఆప్షన్ అందుబాటులో లేదు. హార్ధిక్ పాండ్యా జట్టులో ఉన్నా అతను బౌలింగ్ చేసేందుకు ఫిట్‌గా లేడు. రోహిత్ శర్మకి దీపక్ హుడా రూపంలో ఓ బౌలర్ అందుబాటులో ఉన్నా అతన్ని వాడుకోలేదు...

pakistan

దీంతో పాకిస్తాన్ చేతుల్లో రోహిత్ సేన ఓటమిని కొందరు విరాట్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు పాక్ చేతుల్లో టీమిండియా ఓడితే విరాట్‌‌ కెప్టెన్‌గా పనికి రాడని వన్డే ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ... ఇప్పుడు రోహిత్ శర్మను కూడా కెప్టెన్సీ నుంచి తప్పిస్తుందా... అంటూ కొందరు కోహ్లీ అభిమానులు పోస్టులు చేస్తున్నారు.. 

click me!