నీ కంటే రవిశాస్త్రి బెటర్ కదయ్యా ద్రావిడ్... బాగా ఆడుతున్న వాళ్లను పక్కనబెట్టి ఈ ప్రయోగాలేంటి...

First Published Sep 6, 2022, 7:40 PM IST

టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ హెడ్ కోచ్‌లలో రవిశాస్త్రి ఒకడు. ఐసీసీ టైటిల్ గెలవకపోవడం ఒక్కటీ పక్కనబెడితే రవిశాస్త్రి హయాంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ గడ్డలపై తిరుగులేని విజయాలు అందుకుంది భారత జట్టు. అయితే టీమిండియా ఎప్పుడు ఏ మ్యాచ్ ఓడినా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది మాత్రం రవిశాస్త్రియే... 

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2021 పరాభవంతో రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత హెడ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు రాహుల్ ద్రావిడ్. అయితే ద్రావిడ్ ఏ సమయంలో హెడ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడో కానీ నవంబర్ 2021 నుంచి ఇప్పటివరకూ భారత జట్టుకి 9 మంది కెప్టెన్లు మారారు...

రవిశాస్త్రి హయాంలో భారత రిజర్వు బెంచ్ అత్యంత పటిష్టంగా తయారైంది. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ వంటి కీ ప్లేయర్లు లేకుండా బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాని ఓడించగలిగింది భారత జట్టు...

రాహుల్ ద్రావిడ్ కూడా టీమిండియా నయా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి రిజర్వు బెంచ్‌ని పటిష్టం చేయాలని రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే ఈ ప్రయోగాలు టీమిండియాకి ఇవ్వాల్సిన రిజల్ట్ అయితే ఇవ్వడం లేదు. ముఖ్యంగా యంగ్ ప్లేయర్లకు రావాల్సినన్ని అవకాశాలు దక్కడం లేదు.

Image credit: Getty

ఐపీఎల్ 2022 తర్వాత రాహుల్ త్రిపాఠి... మూడు సిరీస్‌లకు ఎంపికైతే ఆడింది ఒకే ఒక్క మ్యాచ్. అలాగే ఉమ్రాన్ మాలిక్‌ని మూడు మ్యాచుల్లో ఆడించి పక్కనబెట్టేశారు. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయపడడంతో అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చారు కానీ లేకపోతే వాళ్లకి ఇప్పట్లో అవకాశం దక్కేది కాదు...

తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్ మంచి పర్ఫామెన్స్ కనబరిచాడు. 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చిన రవి భిష్ణోయ్, బాబర్ ఆజమ్ వికెట్ తీసి టీమిండియాకి తొలి వికెట్ అందించాడు...

Image credit: Getty

సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చిన మ్యాచ్‌లో రవి భిష్ణోయ్, పవర్ ప్లేలో, డెత్ ఓవర్లలో చాలా చక్కని బౌలింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే తర్వాతి మ్యాచ్‌లో అతనికి తుది జట్టులో చోటు దక్కకపోవడం విమర్శలకు తావిస్తోంది...

Image credit: Getty

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో రవి భిష్ణోయ్‌ని పక్కనబెట్టిన టీమిండియా మేనేజ్‌మెంట్, అతని ప్లేస్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి అవకాశం కల్పించింది. దీంతో రాహుల్ ద్రావిడ్ కంటే, రవిశాస్త్రియే బెటర్... బాగా ఆడితే, అవకాశాలు ఇచ్చి ప్రోత్సాహించేవాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.. 

click me!