పట్టుమని ఐదు మ్యాచులు ఆడలేవా రోహిత్... అదే ఐపీఎల్‌లో అయితే గాయమైనా ఆడతావే...

First Published Sep 8, 2022, 7:27 PM IST

మోస్ట్ ఫిటెస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు రోహిత్ శర్మ. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా రోహిత్, టీమిండియాకి వరల్డ్ కప్స్ అందిస్తాడని భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే ఆసియా కప్ 2022లో రోహిత్‌ కెప్టెన్సీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది...

rohit sharma

దినేశ్ కార్తీక్‌ని పక్కనబెట్టి రిషబ్ పంత్‌కి చోటు ఇవ్వడంతో పాటు దీపక్ హుడాకి బౌలింగ్ ఇవ్వకపోవడం... రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు రావడానికి కారణమయ్యాయి. వీటికి తోడు అర్ష్‌దీప్ సింగ్‌తో రోహిత్ వ్యవహరించిన విధానం కూడా వివాదాస్పదమైంది...

అన్నింటికీ మించి టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు రోహిత్ శర్మ. రెగ్యులర్ కెప్టెన్‌ అనే విషయాన్ని కూడా మరిచిపోయినట్టుగా రోహిత్ కంటే తాత్కాలిక సారథులే ఈ ఏడాది ఎక్కువ సిరీస్‌లను నడిపించారు...

తాజాగా ఆసియా కప్‌ 2022లో ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పటికే సూపర్ 4లో రెండు మ్యాచులు ఓడిపోవడంతో టీమిండియాకి ఇది నామమాత్రపు మ్యాచ్ మాత్రమే. గెలిస్తే పరువు నిలుస్తుంది అంతే...

Image credit: PTI

నామమాత్రపు మ్యాచ్‌లో కూడా నేను ఆడడం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ రోహిత్, ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో రెస్ట్ తీసుకున్నాడు. దీంతో మరోసారి రోహిత్‌ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు. జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో రోహిత్ పాల్గొనలేదు...

rohit

ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా ఇప్పటిదాకా నాలుగు మ్యాచులు మాత్రమే ఆడింది. ఐదో మ్యాచ్‌లో రోహిత్ ఆడడం లేదు. దీంతో పట్టుమని వరుసగా ఐదు మ్యాచులు కూడా ఆడలేని రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్‌ కావాలని ఆశపడడం ఎందుకుని ప్రశ్నిస్తున్నారు అభిమానులు...

rohit sharma

ఐపీఎల్‌లో వరుసగా 14 మ్యాచులు ఆడే రోహిత్ శర్మ, 2020 సీజన్‌లో గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే బరిలో దిగాడు. అలాంటి టీమిండియా తరుపున వరుసగా ఐదు మ్యాచులు ఆడేందుకు కూడా సిద్ధపడకపోవడాన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్...

Rohit Sharma

టీమిండియా ఓడిపోతుంటే ట్రోలింగ్ వస్తోందనే బాధతో రోహిత్ శర్మ, ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌కి దూరమయ్యాడని మరికొందరు అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే విరాట్ కోహ్లీ ఇలాంటి బాధలను, ఓటములను, అవమానాలను ఎన్ని ఎదుర్కొన్నాడో మరిచిపోయారా? అంటూ హిట్ మ్యాన్‌ని మరోసారి టార్గెట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు..

Rohit Sharma Asia Cup

బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ట్రోలింగ్ ఎదుర్కొనే రోహిత్ శర్మ బాడీ లాంగ్వేజ్‌లో కాన్ఫిడెన్స్ కనిపించలేదు. ఇప్పుడు ఇలా ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఖరి మ్యాచ్ నుంచి తప్పుకుని, తనపై మరిన్ని విమర్శలు రావడానికి తనకి తానే కారణమయ్యాడు రోహిత్ శర్మ.. 

click me!