ప్రపంచ క్రికెట్ లో తమకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నారు భారత క్రికెటర్లు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకశైలి. అయితే మన క్రికెటర్లు మహిళలు అయితే..? వారు ఎలా ఉండేవారు..? అనే కాన్సెప్ట్ తో SK MD Abu Sahid అనే ఓ ఆర్టిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో కొన్ని చిత్రాలను గీశాడు.
టీమిండియా టాప్ క్రికెటర్లలో పలువురు కీలక ఆటగాళ్లను తీసుకుని మిడ్ జర్నీ అనే ఎఐ టూల్ ద్వారా ఈ చిత్రాలను గీశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో అబూ సాహిద్ క్రికెటర్ల ఫేస్ తో పాటు వారి పేర్లను కూడా మార్చాడు.
రాశి పంత్ (టీమిండియా యువ వికెట్ కీపర్, తన బ్యాటింగ్ విన్యాసాలతో అలరించే ఉత్తరాఖండ్ ఆటగాడు రిషభ్ పంత్)
శిఖా ధావన్ (అభిమానులు ముద్దుగా గబ్బర్ అని పిలుచుకునే వెటరన్ బ్యాటర్, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ సారథి శిఖర్ ధావన్)
రవీనా జడేజా (భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు జడ్డూ అలియాస్ రవీంద్ర జడేజా)
రోహిణి శర్మ (ముంబై ఇండియన్స్, భారత క్రికెట్ జట్లకు సారథి గా వ్యవహరిస్తూ మూడు డబుల్ సెంచరీలు చేసిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ)
యువరాణి సింగ్ (భారత్ కు రెండు ఐసీసీ టోర్నీలు అందించడంలో కీలక పాత్ర పోషించి క్యాన్సర్ జయించిన యువరాజ్ సింగ్)
గౌతమి గంభీర్ (టీమిండియా మాజీ ఓపెనర్, దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్)
హర్షలి పాండ్యా (టీమిండియా ఆల్ రౌండర్, భావి భారత సారథి (?), ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన హార్ధిక్ పాండ్యా)
మహి సింగ్ ధోని (దిగ్గజ సారథి, భారత్ కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి లెక్కలేనంత మంది అభిమానాన్ని పొందుతున్న మహేంద్ర సింగ్ ధోని)
సుభద్ర గిల్ (టీమిండియా యువ సంచలనం, అత్యంత పిన్న వయసులోనే డబుల్ సెంచరీ బాదిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్)
విద్యా కోహ్లీ (పరుగుల యంత్రం, ఛేజ్ మాస్టర్, వంద సెంచరీల దిశగా అడుగులు వేస్తున్న కింగ్ విరాట్ కోహ్లీ)