చాలా మాట్లాడాలని స్పీచ్ ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నా...తొలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డుపై అర్ష్‌దీప్ సింగ్..

First Published Sep 29, 2022, 1:53 PM IST

తిరువనంతపురంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది భారత జట్టు. స్వింగ్‌కి అద్భుతంగా అనకూలిస్తున్న పిచ్‌పై దీపక్ చాహార్, అర్ష్‌దీప్ సింగ్ అదిరిపోయే బౌలింగ్ పర్ఫామెన్స్ ఇచ్చి, పర్యాటక జట్టుకి చుక్కలు చూపించారు. ఈ ఇద్దరి భీకర స్పెల్ కారణంగా 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా..

మొదటి ఓవర్‌లో సఫారీ కెప్టెన్ భవుమాని దీపక్ చాహార్ క్లీన్ బౌల్డ్ చేయగా ఆ తర్వాత ఓవర్‌లో క్వింటన్ డి కాక్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు అర్ష్‌దీప్ సింగ్. అదే ఓవర్‌లో రొస్సో, డేవిడ్ మిల్లర్ వికెట్లు కూడా తీశాడు అర్ష్‌దీప్ సింగ్...

arshdeep

105 టీ20 మ్యాచుల్లో 91 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన డేవిడ్ మిల్లర్, మొట్టమొదటిసారి టీ20ల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అది కూడా 12 మ్యాచుల అనుభవం మాత్రమే ఉన్న యంగ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో...

Image credit: PTI

4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ కెరీర్‌లో మొట్టమొదటి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.‘నేను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చినప్పుడు ఇలా మాట్లాడాలి? అలా మాట్లాడాలి? అని చాలా ప్రాక్టీస్ చేశా. అయితే ఇప్పుడు అవేమీ గుర్తుకురావడం లేదు. ..

Image credit: PTI

మొదటి ఓవర్‌లో దీపక్ చాహార్ బౌలింగ్ వేసిన తీరు, వికెట్ తీసిన తర్వాత పిచ్ గురించి నాకు పూర్తి క్లారిటీ వచ్చింది. ఏం చేస్తే వికెట్ పడుతుందో అర్థమైంది. అదే అమలు చేశా. సరైన ఏరియాల్లో బౌలింగ్ చేస్తే చాలు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే వికెట్ దక్కుతుంది...
 

డేవిడ్ మిల్లర్ వికెట్ తీయడం భలే మజాని ఇచ్చింది. అతను నేను అవుట్ స్వింగర్ వేస్తానని అనుకున్నాడు కానీ మిల్లర్‌ని బోల్తా కొట్టించడం భలే ఆనందాన్నిచ్చింది... ఇదే పర్ఫామెన్స్ కొనసాగించేందుకు ప్రయత్నిస్తా...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత యంగ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్...  

click me!