ఎన్నాళ్లో వేచిన ఉదయం... విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారాలకు కమ్‌బ్యాక్ ఇయర్‌గా 2022...

First Published Dec 16, 2022, 4:08 PM IST

విరాట్ కోహ్లీ, ప్రపంచ క్రికెట్ చరిత్రలో తిరుగులేని బ్యాటర్. ఛతేశ్వర్ పూజారా.. టెస్టు క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ బెస్ట్ క్లాస్ ప్లేయర్. అయితే ఈ ఇద్దరూ మూడేళ్లకు పైగా సెంచరీలు చేయలేక తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఛతేశ్వర్ పూజారా అయితే పేలవ ఫామ్‌లో టీమ్‌లో చోటు కూడా కోల్పోయాడు...

అప్పుడెప్పుడో 2019, జనవరి 3న ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన ఛతేశ్వర్ పూజారా... నాలుగేళ్లుగా త్రిబుల్ డిజిట్ స్కోరును అందుకోలేకపోయాడు. సిడ్నీలో జరిగిన ఆ టెస్టులో 373 బంతుల్లో 22 ఫోర్లతో 193 పరుగులు చేసి అవుట్ అయ్యాడు పూజారా...

Pujara Kohli

2020 ఆస్ట్రేలియా టూర్‌లో మూడు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న ఛతేశ్వర్ పూజారా... బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సిడ్నీ టెస్టు తర్వాత 29 టెస్టులు ఆడిన పూజారా... 52 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు...

Pujara-Kohli

47 నెలలుగా, 29 టెస్టులు, 52 ఇన్నింగ్స్‌లుగా సెంచరీ చేయకపోవడంతో సౌతాఫ్రికా టూర్ తర్వాత జట్టులో చోటు కూడా కోల్పోయాడు ఛతేశ్వర్ పూజారా. టీమ్‌లో ప్లేస్ కోల్పోయిన పూజారా, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చాడు...

Pujara Kohli

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సుసెక్స్ క్లబ్ తరుపున ఆడిన ఛతేశ్వర్ పూజారా, నాలుగు సెంచరీలు, అందులో మూడు డబుల్ సెంచరీలతో 8 మ్యాచుల్లో 1094 పరుగులు చేశాడు. 109.4 యావరేజ్‌తో కౌంటీల్లో దుమ్మురేపిన పూజారాని తిరిగి టీమ్‌లోకి తీసుకొచ్చారు సెలక్టర్లు...

kohli pujara

డగౌట్‌లో రాహుల్ ద్రావిడ్ ఉండడంతో బంగ్లాతో రెండో ఇన్నింగ్స్‌లో తన స్టైల్‌కి విరుద్ధంగా దూకుడగా ఆడిన ఛతేశ్వర్ పూజారా, 130 బంతుల్లో 13 ఫోర్లతో కెరీర్‌లో 19వ సెంచరీ అందుకున్నాడు...

ఛతేశ్వర్ పూజారా కంటే విరాట్ కోహ్లీ కూడా మూడేళ్లుగా సెంచరీ చేయలేక ఇబ్బంది పడ్డాడు. జెట్ స్పీడ్‌తో 70 సెంచరీలు అందుకున్న కోహ్లీ, 71వ సెంచరీ మార్కును అందుకోవడానికి 100కి పైగా ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది..

ఆసియా కప్ 2022కి ముందు టీ20లకు పనికి రాడని, కుర్రాళ్లను ఆడించడం బెటర్ అంటూ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ... తన బ్యాటుతోనే వాటికి సమాధానం చెప్పాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై టీ20 సెంచరీ బాది, కెరీర్‌లో 71వ సెంచరీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ...

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో శతకాన్ని బాది... 40 నెలల విరామాన్ని బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. 2019లో చివరి వన్డే సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, బంగ్లాటూర్‌లో 44వ వన్డే సెంచరీ అందుకున్నాడు. 

Virat Kohli

ఇక మిగిలింది టెస్టు సెంచరీ విరామాన్ని బ్రేక్ చేయడమే. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి, 2022 ఏడాది ఘనంగా ముగించాలని కోరుకుంటున్నారు అభిమానులు.. 

click me!