రెండో వన్డేలోనూ ఇంగ్లాండ్ చేతుల్లో పాక్ చిత్తు... బౌలర్లు రాణించినా, చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్...

First Published Jul 11, 2021, 10:39 AM IST

మొదటి వన్డేలో ఇంగ్లాండ్ సీ టీమ్ చేతుల్లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ జట్టు, రెండో వన్డేలోనూ సేమ్ సీన్ రిపీట్ చేసింది. రెండో వన్డేలో పాక్ బౌలర్లు రాణించినా, బ్యాట్స్‌మెన్ చేతులు ఎత్తేయడంతో 52 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది ఇంగ్లాండ్ జట్టు...

టాస్ గెలిచిన పాక్ జట్టు, ఇంగ్లాండ్‌కి బ్యాటింగ్ అప్పగించింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. మొదటి వన్డేలో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న డేవిడ్ మలాన్, జాక్ క్రావ్లే డకౌట్ కావడంతో 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు...
undefined
అయితే ఫిలిప్ సాల్ట్ 60 పరుగులు, జాక్ విన్స్ 56 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. బెన్ స్టోక్స్ 22 పరుగులకే అవుటైనా గ్రేగరీ 40 పరుగులు చేశాడు...
undefined
8వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన బేడన్ కర్స్ 31 పరుగులతో రాణించడంతో 45.2 ఓవర్లలో 247 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్ జట్టు.
undefined
248 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన పాక్ జట్టు, 41 ఓవర్లలో 195 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇమామ్ వుక్ హక్ ఒక్క పరుగు చేయగా, బాబర్ ఆజమ్ 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
undefined
ఫకార్ జమాన్ 45 బంతుల్లో 10 పరుగులు చేయగా సౌద్ షకీల్ 56 పరుగులు, హసన్ ఆలీ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేసి పోరాడారు...
undefined
ఇంగ్లాండ్ బౌలర్లలో సదీక్ మహ్మద్, క్రాగ్ ఓవర్టన్, మాథ్యూ పార్కిసన్ రెండేసి వికెట్లు తీయగా, లూయిస్ గ్రేగరీ 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు...
undefined
వరుసగా రెండు మ్యాచుల్లోనూ 200+ మార్కు అందుకోలేకపోయిన పాక్ జట్టు 0-2 తేడాతో వన్డే సిరీస్ కోల్పోగా, పూర్తిగా కొత్త జట్టుతో బరిలో దిగి సిరీస్ గెలిచి మ్యాజిక్ చేశాడు బెన్‌స్టోక్స్...
undefined
click me!