సానియా మీర్జా‌తో సికందర్ రజాకు లింకేంటి..? ఇద్దరూ బంధువులా..?

Published : Jun 30, 2023, 01:09 PM ISTUpdated : Jun 30, 2023, 01:11 PM IST

జింబాబ్వే  ఆల్ రౌండర్ సికందర్ రజా,  ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చుట్టాలా..? ఇద్దరి చుట్టరికానికి ఏంటి సంబంధం..?   

PREV
16
సానియా మీర్జా‌తో సికందర్ రజాకు లింకేంటి..?  ఇద్దరూ బంధువులా..?

జింబాబ్వే  క్రికెట్ జట్టులో  ఆల్ రౌండర్ సికందర్ రజా సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు.    గతేడాది ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో ఆ జట్టులో కీలక సభ్యుడిగా మారిన రజా.. తాజాగా జింబాబ్వేలోనే జరుగుతున్న వన్డే వరల్డ్ కప్  క్వాలిఫయర్స్ లో  కూడా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా రాణిస్తూ  ఆ జట్టు విజయాలలో భాగమవుతున్నాడు. 

26

ఇక  భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా  పరిచయం అక్కర్లేదు.  18 ఏండ్ల వయసు నుంచే టెన్నిస్ రాకెట్ తో అంతర్జాతీయ వేదికపై సంచలనాలు సృష్టించిన ఆమె  ప్రస్తుతం టెన్నిస్ కు గుడ్ బై చెప్పింది. 

36

రజా  ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిపయర్స్ లో జింబాబ్వేకు సంచలన  ప్రదర్శనలు చేస్తుండటంతో.. రజా - సానియా మీర్జాలు బంధువులన్న వార్తలు   పలు  వెబ్‌సైట్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా దర్శనమిచ్చాయి.  

46

జింబాబ్వే తరఫున ఆడుతున్నా రజాది పాకిస్తాన్ అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ లోని సియాల్‌కోట్ కు చెందిన రజా..  చిన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ లో చేరాలనుకుని ఆ కల నిజం కాకపోవడంతో  క్రికెట్ వైపునకు దృష్టి మరల్చాడు.  ఆ తర్వాత వాళ్ల కుటుంబం జింబాబ్వేకు మారడంతో ఆ దేశం తరఫునే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. 

56

సానియా మీర్జా భర్త  షోయభ్ మాలిక్ ది కూడా సియాల్‌కోట్ ప్రాంతమే.    2010లో వీరి వివాహం జరిగింది. అయితే  రజా - సానియా మీర్జాలు రిలేటివ్స్ అని వార్తలు రావడంతో  మాలిక్‌కు  రజా ఏమైనా వేలు విడిచిన చుట్టమా..?  లేదా   తల్లి తరఫునో, తండ్రి తరఫునో చుట్టం కావొచ్చు అన్న అనుమానాలు కూడా   తలెత్తాయి. 

66

కానీ  అలాంటిదేమీ లేదు. ఈ ఇద్దరికీ చుట్టరికం లేదు. కేవలం షోయభ్ మాలిక్, రజాలది సియాల్‌కోట్ అనే ఒకే ఒక్క ప్రాంతం తప్ప ఈ ఇద్దరికీ మరే రిలేషన్ లేదు.   సానియా మీర్జాకు కూడా   రజాతో  చుట్టరికం లేదు.. 

click me!

Recommended Stories