బిడ్డను గుండెలకు హత్తుకున్న అనుష్క శర్మ... బ్యాగులు మోస్తూ విరాట్ కోహ్లీ...

First Published Jun 3, 2021, 11:18 AM IST

భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ షెడ్యూల్ కోసం ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లింది. జూన్ 2న లండన్ ఫ్లైట్ ఎక్కిన భారత మహిళల, పురుషుల జట్టు, నేడు అక్కడికి చేరుకుని మూడు రోజుల క్వారంటైన్‌లో గడపనున్నాయి. ముంబై బయో బబుల్ జోన్ నుంచి విమానాశ్రయానికి చేరుకున్నారు క్రికెటర్లు.

ఇంగ్లాండ్ టూర్‌కి క్రికెటర్లు కుటుంబసమేతంగా వచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించింది. దీంతో విరాట్ కోహ్లీతో సహా భారత క్రికెటర్లు తమ కుటుంబాలతో కలిసి ఇంగ్లాండ్‌కి బయలుదేరి వెళ్లారు.
undefined
అనుష్క శర్మ, వామికను ఎవ్వరికీ కనిపించకుండా గుండెలకు హత్తుకుని, పట్టుకుని వెళ్లగా, వెనకాల ఆమె భర్త విరాట్ కోహ్లీ బ్యాగులతో తనను అనుసరించాడు. వామిక కోహ్లీని మీడియాకి, సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్టు కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ టూర్‌లో ఓ టెస్టుతో పాటు మూడు వన్డేలు, టీ20 సిరీస్‌ ఆడనుంది. భారత జట్టు సౌంతిప్టన్‌లో న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత అక్కడే ఉండి ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
undefined
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆగస్టు 4న ప్రారంభం అవుతుండడం, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కీ, ఈ సిరీస్‌కి మధ్య 42 రోజుల గ్యాప్ ఉండడంతో ఈ షెడ్యూల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
undefined
ఈ 42 రోజులు ఇంగ్లాండ్‌లో భారత జట్టు ఏం చేస్తుందని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్, బీసీసీఐని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే భారత క్రికెట్ బోర్డు మాత్రం ఈ గ్యాప్ గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
undefined
ముంబై ఎయిర్‌పోర్టులో ఛార్టెడ్ ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్న మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్...
undefined
ఛార్టెడ్ ఫ్లైట్‌లో లండన్‌కి బయలుదేరినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్టు చేసిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్...
undefined
click me!