లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, సిరాజ్‌తో ఓపెనింగ్ వేయిద్దాం... విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి ఆడియో లీక్...

First Published Jun 3, 2021, 11:00 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ కోసం టీమిండియా ఇప్పటినుంచే కసరత్తులు, ప్రణాళికలు మొదలెట్టేసింది. ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న భారత జట్టు, జూన్ 18న సౌంతిప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

ఇంగ్లాండ్‌కి బయలుదేరి వెళ్లేముందు భారత మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు హెడ్ కోచ్ రవిశాస్త్రి, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ. ఈ మీటింగ్ ప్రారంభానికి ముందు ఆడియో ఆన్‌లో ఉందన్న విషయం గ్రహించని కోహ్లీ, రవిశాస్త్రితో చేసిన కామెంట్లు లీక్ అయ్యాయి.
undefined
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు, ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. జూన్ 2న తొలి టెస్టు ప్రారంభమైంది. మొదటి రోజు ఆట ముగిసేసమయానికి 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, 246 పరుగులు చేసింది.
undefined
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మొదటి మ్యాచ్ ఆడుతున్న డివాన్ కాన్వే, అజేయ సెంచరీతో అదరగొట్టాడు. అతనికి తోడు హెన్రీ నికోలస్ 46 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కేన్ విలియంసన్ 1, రాస్ టేలర్ 14 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
undefined
ఈ మ్యాచ్ చూస్తూ, మీడియా సమావేశానికి వచ్చిన భారత సారథి విరాట్ కోహ్లీ, ఆన్‌లైన్‌లోకి వచ్చినా వీడియో ఆన్‌చేయకముందు చేసిన కామెంట్లు, లీక్ అయ్యాయి.
undefined
‘మనం వీళ్లకి రౌండ్ ద వికెట్ వేద్దాం. వీరిలో లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు. కాబట్టి లాలా సిరాజ్‌కి ముందు బౌలింగ్ ఇద్దాం’ అంటూ విరాట్ కోహ్లీ చెప్పగా, రవిశాస్త్రి... ‘మ్... మ్’ అనడం ఈ ఆడియోలో స్పష్టంగా వినిపించింది.
undefined
కోహ్లీకి చెప్పిన ఆ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ డివాన్ కాన్వేనే కావడం విశేషం. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఒల్లీ రాబిన్‌సన్, మార్క్ వుడ్ బౌలింగ్‌‌ను కూడా అద్భుతంగా ఎదుర్కొన్న కాన్వే 240 బంతుల్లో 16 ఫోర్లతో 136 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
undefined
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మహ్మద్ సిరాజ్‌ను ఆడించాలని టీమిండియా భావిస్తున్నట్టు ఈ ఆడియో ద్వారా తెలుస్తోంది. అయితే సిరాజ్‌కి స్థానం కల్పిస్తే సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను పక్కనబెట్టాల్సి ఉంటుంది.
undefined
జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ తుదిజట్టులో ఉండడం తప్పనిసరి. వీరితో పాటు మరో పేసర్‌గా ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ మధ్య పోటీ నెలకొంది. ఇషాంత్ శర్మకు ఇంగ్లాండ్ పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది.
undefined
అయితే సిరాజ్‌ ఈ మధ్య అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో కూడా 3 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు.
undefined
అయితే సీనియర్ పేసర్ ఇషాంత్ కంటే, పెద్దగా అనుభవం లేని మహ్మద్ సిరాజ్‌కి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు కల్పిస్తారని ఎవ్వరూ ఊహించరు.ఈ ఆడియో లీక్ కావడం వల్ల న్యూజిలాండ్ జాగ్రత్త పడి, సిరాజ్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది.
undefined
click me!