ఐపీఎల్ అవార్డ్స్ 2023: బెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ, బెస్ట్ బ్యాటర్‌గా ఏబీ డివిల్లియర్స్... ధోనీకి నిరాశే!..

Published : Feb 20, 2023, 03:19 PM IST

ఐపీఎల్ ప్రారంభమై 15 సీజన్లు పూర్తైన సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, ప్రత్యేకంగా అవార్డ్స్ అందచేసింది. 15 సీజన్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన వారిని గుర్తించి, అవార్డులకు ఎంపిక చేసింది...  

PREV
110
ఐపీఎల్ అవార్డ్స్ 2023: బెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ, బెస్ట్ బ్యాటర్‌గా ఏబీ డివిల్లియర్స్... ధోనీకి నిరాశే!..

బెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ: 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, బెస్ట్ ఐపీఎల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 8 సీజన్లలో 5 టైటిల్స్ గెలిచిన రోహిత్, ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్నాడు...

210

అయితే 13 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్సీ చేసి, 11 సార్లు ప్లేఆఫ్స్, 9 సార్లు ఫైనల్ చేర్చిన మహేంద్ర సింగ్ ధోనీకి ఈ కేటగిరిలో అవార్డు దక్కకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు మాహీ అభిమానులు...

310

బెస్ట్ బ్యాటర్‌గా ఏబీ డివిల్లియర్స్: ఐపీఎల్ కెరీర్‌లో 184 మ్యాచులు ఆడి 39.7 సగటుతో 151.68 సగటుతో 5162 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్, బెస్ట్ ఐపీఎల్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు.. స్వదేశీ దిగ్గజాలను కాదని, ఏబీడీకి బెస్ట్ ఐపీఎల్ బ్యాటర్ దక్కడం విశేషం..

410

6 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌లతో పాటు ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ రైనా, డేవిడ్ వార్నర్‌లను బెస్ట్ బ్యాటర్ కేటగిరిలో పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఏబీడి చేసిన పరుగులు, అందించిన విజయాల శాతాన్ని బట్టి బెస్ట్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు..

510

బెస్ట్ బౌలర్‌గా జస్ప్రిత్ బుమ్రా: భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాని, ఐపీఎల్ కెరీర్‌లో బెస్ట్ బౌలర్‌గా ఎంచుకుంది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. తన కెరీర్‌లో 120 ఐపీఎల్ మ్యాచులు ఆడిన బుమ్రా, 145 వికెట్లు తీశాడు...

610


ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న డీజే బ్రావోని, 170 వికెట్లు తీసిన లసిత్ మలింగలను బెస్ట్ బౌలర్లుగా పట్టించుకోకపోవడం విశేషం. ముంబైకి టైటిల్స్ అందించడంలో బుమ్రా పాత్రను బట్టి, బెస్ట్ బౌలర్‌గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది..

710

బెస్ట్ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆండ్రూ రస్సెల్: కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్‌ని బెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంచుకుంది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. ఐపీఎల్ చరిత్రలో 98 మ్యాచులు ఆడిన రస్సెల్, 2035 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 89 వికెట్లు పడగొట్టి.. బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచాడు..
 

810

బెస్ట్ బ్యాటింగ్ పర్ఫామెన్స్ విరాట్ కోహ్లీ: ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, 2016 సీజన్‌లో చూపించిన పర్ఫామెన్స్‌కి ఐపీఎల్ బెస్ట్ బ్యాటింగ్ పర్ఫామెన్స్ దక్కింది. 2016 సీజన్‌లో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో 900+ పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు కోహ్లీ..

910

బెస్ట్ బౌలింగ్ పర్ఫామెన్స్ సునీల్ నరైన్: ఐపీఎల్‌లో 148 మ్యాచులు ఆడి 152 వికెట్లు పడగొట్టాడు కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్. 2012 సీజన్‌లో 15 మ్యాచుల్లో 24 వికెట్లు తీసిన సునీల్ నరైన్, కేకేఆర్‌ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు... సునీల్ నరైన్ బౌలింగ్ పర్ఫామెన్స్‌ని బెస్ట్ బౌలింగ్ ప్రదర్శనగా ఎంపిక చేసింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్...

1010

టీమ్‌ల వారీగా చూసుకుంటే కేకేఆర్‌కి రెండు, ఆర్‌సీబీకి రెండు, ముంబై ఇండియన్స్‌కి రెండు అవార్డులు దక్కాయి. అసలు ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ఆర్‌సీబీకి రెండు అవార్డులు ఇచ్చి, నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కేకి ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్.. 

Read more Photos on
click me!

Recommended Stories