వీరూ భాయ్... ఇప్పుడైనా నా సాలరీ పెంచండి, ప్లీజ్... అమిత్ మిశ్రా అలా అడగడంతో...

Published : Apr 22, 2021, 04:00 PM IST

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా టాప్‌లో ఉన్నాడు లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. 2008 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్ ఆడుతున్న అతి కొద్ది ప్లేయర్లలో ఒకడైన అమిత్ మిశ్రా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్...

PREV
110
వీరూ భాయ్... ఇప్పుడైనా నా సాలరీ పెంచండి, ప్లీజ్... అమిత్ మిశ్రా అలా అడగడంతో...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన అమిత్ మిశ్రా, డిఫెండింగ్ ఛాంపియన్ స్వల్ప స్కోరుకే పరిమితం కావడంలో కీలక పాత్ర పోషించాడు...

210

ఐపీఎల్‌లో రోహిత్ శర్మను ఏడోసారి అవుట్ చేసిన అమిత్ మిశ్రా, అదే ఓవర్‌లో హార్ధిక్ పాండ్యాను డకౌట్ చేశాడు. ఆ తర్వాత డేంజరస్ మ్యాన్ కిరన్ పోలార్డ్, ఇషాన్ కిషన్ కూడా మిశ్రా బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు...

310

‘అమిత్ మిశ్రా చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తాడు. కానీ అతనిలో చాలా హ్యూమర్ ఉంది. కామ్‌గా ఉండే మిశ్రా, ఫన్నీగా పంచులు వేస్తూ అందర్నీ నవ్విస్తుంటాడు... అందుకే జట్టులో అందరికీ మిశ్రా అంటే ఇష్టం...

410

మిశ్రా ఓవర్‌లో పరుగులు వస్తే, మిగిలిన ప్లేయర్లు కూడా బాధపడతారు. అదే అమిత్ మిశ్రా వికెట్లు తీస్తే, అందరూ సంతోషిస్తారు... ఢిల్లీ జట్టులో అతనికి ఉన్న అనుబంధం అలాంటిది...

510

2008 సీజన్‌లో అతను ఐపీఎల్‌లో మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించాడు. అప్పుడు అతనికి దగ్గరికి వెళ్లి... ‘ఏం కావాలి...’ అని అడిగాను... ‘వీరూ భాయ్... దయచేసి నా సాలరీ పెంచండి ప్లీజ్’ అన్నాడు అమిత్ మిశ్రా. అతను అలా అడగడం చూసి నాకు ఒక్కసారిగా నవ్వు ఆగలేదు. 

610

అమిత్ మిశ్రాకి ఇప్పుడు ఆ అవసరం రాదనుకుంటా...’ అంటూ చెప్పుకొచ్చాడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి మొదటి సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహారించిన వీరేంద్ర సెహ్వాగ్...

710

ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఏకైక ప్లేయర్‌గా ఉన్న అమిత్ మిశ్రా, మొత్తంగా 163 వికెట్లు తీసి... లసిత్ మలింగ (170 వికెట్లు) రికార్డుకు చేరువలో ఉన్నాడు...

810

‘పవర్‌ప్లేలో బౌలింగ్‌కి వచ్చినప్పుడు అమిత్ మిశ్రా కాస్త ఒత్తిడికి గురయ్యాడు. సూర్యకుమార్ యాదవ్, మిశ్రా బౌలింగ్‌లో చక్కని షాట్లు ఆడాడు. అయితే పవర్ ప్లే పూర్తైన తర్వాత మిశ్రా జీ మ్యాజిక్ చేశాడు...

910

బ్యాట్స్‌మెన్‌కి తగ్గట్టుగా ఎలాంటి బంతులు వేయాలో, ఎంత వేగంతో వేయాలో మిశ్రాకి బాగా తెలుసు... రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా ఒకే ఓవర్‌లో అవుట్ కాకపోయిఉంటే ముంబై ఇండియన్స్ కచ్ఛితంగా మరో 60,70 పరుగులు చేసి ఉండేవాడే...’ అంటూ చెప్పుకొచ్చాడు వీరూ...

1010

మలింగ రికార్డుకు చేరువలో ఉన్న అమిత్ మిశ్రా... ‘రికార్డుల గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఒకవేళ మలింగ రికార్డును నేను బ్రేక్ చేసినా... అది పెద్ద ఘనతగా భావించడం లేదు’ అంటూ కామెంట్ చేశాడు. 

click me!

Recommended Stories