అదరగొట్టిన అంబటి రాయుడు... సిక్సర్లతో చెలరేగిన తెలుగు క్రికెటర్... ముంబైపై సీఎస్‌కే భారీ స్కోరు...

First Published May 1, 2021, 9:28 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటిదాకా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు, ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సునామీ ఇన్నింగ్స్‌తో మెరుపులు మెరిపించాడు. రాయుడితో పాటు మొయిన్ ఆలీ, డుప్లిసిస్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగుల భారీ స్కోరు చేసింది సీఎస్‌కే...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్‌కి శుభారంభం దక్కలేదు. ఓ ఫోర్ బాదిన రుతురాజ్ గైక్వాడ్, మొదటి ఓవర్‌లోనే హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది సీఎస్‌కే...
undefined
ఆ తర్వాత మొయిన్ ఆలీ, డుప్లిసిస్ కలిసి రెండో వికెట్‌కి 108 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
undefined
ఆ తర్వాత 28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసిన డుప్లిసిస్, కిరన్ పోలార్డ్ బౌలింగ్‌లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే 2 పరుగులు చేసిన సురేశ్ రైనా కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
undefined
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు, ముంబై ఇండియన్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి బౌలర్ల బౌలింగ్‌లోనూ ఈజీగా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
undefined
27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులు చేసిన అంబటి రాయుడు దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండడంతో రవీంద్ర జడేజా 22 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసి అతనికి స్ట్రైయికింగ్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చాడు.
undefined
అంబటి రాయుడు సిక్సర్ల మోత కారణంగా ఐపీఎల్‌లో తన చెత్త ప్రదర్శన నమోదుచేసుకున్నాడు బుమ్రా. 4 ఓవర్లలో ఓ వికెట్ మాత్రమే తీసిన బుమ్రా 56 పరుగులు సమర్పించాడు.
undefined
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటిదాకా ముంబై ఇండియన్స్ ఎప్పుడూ 200+ స్కోరును చేధించలేదు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి 200+ నమోదుచేయడం 19వ సారి...
undefined
click me!