అంబటి రాయుడి కంటే అతను ఎందులో బెటర్... ట్రెండింగ్‌లో త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్...

First Published May 1, 2021, 10:03 PM IST

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు, అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ముంబై ఇండియన్స్ వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లైన బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. ఇటు అంబటి రాయుడు సిక్సర్ల మోత మోగిస్తుంటే, సోషల్ మీడియాలో విజయ్ శంకర్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది...

27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులు చేసిన అంబటి రాయుడి సెన్సేషనల్ ఇన్నింగ్స్ కారణంగా వరల్డ్ క్లాస్ బెస్ట్ బౌలర్లుగా పేరొందిన బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ భారీగా పరుగులు సమర్పించారు. బుమ్రా, కుల్‌కర్ణి, బౌల్ట్ కలిసి 148 పరుగులు ఇచ్చారు.
undefined
అంబటి రాయుడికి, విజయ్ శంకర్‌కి ఉన్న ప్రత్యేక అనుబంధం అలాంటిది... 2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో భారత జట్టుకి అంబటి రాయుడికి కాదని, విజయ్ శంకర్‌ని సెలక్ట్ చేశారు బీసీసీఐ సెలక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్, అండ్ కో...
undefined
అప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగల సమర్థుడిగా నిరూపించుకున్న అంబటి రాయుడు, భారత జట్టుకి కొన్ని మ్యాచుల్లో ఒంటిచేత్తో విజయాలు కూడా అందించాడు...
undefined
అయితే అలాంటి అంబటి రాయుడిని కాదని, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ని వన్డే వరల్డ్‌కప్ టీమ్‌కి ఎంపిక చేశారు బీసీసీఐ సెలక్టర్లు. ఆ సమయంలో ఈ విషయం గురించి చాలా పెద్ద హైడ్రామా నడిచింది...
undefined
విజయ్ శంకర్ సెలక్షన్ గురించి వివరణ ఇచ్చిన ఎమ్మెస్కే ప్రసాద్... ‘విజయ్ శంకర్ మంచి ఫీల్డర్, బౌల్ చేయగలడు, బ్యాటు కూడా చేయగలడు. మూడు విధాలుగా టీమ్‌కి ఉపయోగపడతాడు’ అంటూ కామెంట్ చేశాడు.
undefined
దీంతో ఆగ్రహానికి గురైన అంబటి రాయుడు... ‘టీమిండియా ఆడే మ్యాచులు చూసేందుకు త్రీడీ గ్లాసెస్ కొనుగోలు చేశానని’ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కారణంగా విజయ్ శంకర్‌తో పాటు మరో ఇద్దరు ప్లేయర్లు గాయపడినా అంబటి రాయుడికి చోటు దక్కలేదు.
undefined
అంబటి రాయుడికి బదులుగా వన్డే వరల్డ్‌కప్ ఆడిన విజయ్ శంకర్, వరల్డ్‌కప్‌లో వేసిన మొదటి బంతికే వికెట్ తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే నెట్స్‌లో బుమ్రా వేసిన బంతి, విజయ్ శంకర్‌కి బలంగా తగలడంతో టోర్నీ మధ్యలోనే నిష్కమించాడు విజయ్ శంకర్...
undefined
విజయ్ శంకర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి పెద్ద గుదిబండగా మారగా, అంబటి రాయుడు తాను ఏం చేయగలడో చేసి చూపించాడు.
undefined
వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కని కారణంగా అసహనానికి గురైన అంబటి రాయుడు, అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నా, జట్టులో చోటు మాత్రం దక్కలేదు.
undefined
2019 వన్డే వరల్డ్‌కప్‌లోగ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా... సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా ఘోరంగా విఫలమైంది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 240 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా 221 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
undefined
ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. కనీసం 10 టెస్టులు కూడా ఆడిన అనుభవం లేని క్రికెటర్లను సెలక్టర్లుగా నియమిస్తే, జట్టు ఎంపిక ఇలాగే ఉంటుందని బహిరంగంగానే విమర్శించారు భజ్జీ, సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు.
undefined
click me!