ఐపీఎల్ పనికి మాలిన లీగ్... ఏ జట్టు కూడా ప్లేయర్లను పంపించొద్దు... ఆలెన్ బోర్డర్ షాకింగ్ కామెంట్స్..

First Published Nov 22, 2020, 2:11 PM IST

ప్రపంచంలోనే అత్యంత విజయవంతంగా క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. 13 అంచెలుగా సాగుతున్న ఐపీఎల్‌కి యేటికేటికి క్రేజ్ పెరుగుతూనే ఉంది. 2020 సీజన్‌కి వచ్చిన రికార్డు వ్యూయర్‌షిప్ దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల క్రికెట్‌కి పైసా ఉపయోగం లేదని, కేవలం క్రికెటర్ల జేబులు నింపడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆలెన్ బోర్డర్.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ టోర్నమెంట్‌గా రికార్డు క్రియేట్ చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. స్టార్ క్రికెటర్ల కోసం కోట్లు కుమ్మరించే ఫ్రాంఛైజీ, టాలెంట్ ఉన్న యంగ్ క్రికెటర్లకు భారీగా ధర చెల్లించేందుకు వెనుకాడవు.
undefined
శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా వంటి క్రికెటర్ల టాలెంట్‌ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన వేదిక కూడా ఐపీఎల్‌యే...
undefined
అయితే ఐపీఎల్‌ ఓ పనికిమాలిన లీగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ ఆలెన్ బోర్డర్. ‘ఐపీఎల్ వంటి టీ20 లీగ్‌ల వల్ల క్రికెట్‌కి ఎలాంటి ఉపయోగం ఉండదు... ఇవి ఎందుకు పనికిరాని లీగ్‌లు..’ అంటూ వ్యాఖ్యానించాడు బోర్డర్.
undefined
‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటే టీ20 ప్రపంచకప్‌కి ప్రాధాన్యం ఇచ్చి ఉండొచ్చు. కరోనా కారణంగా టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించలేమని వాయిదా వేసి, అదే టైమ్‌లో ఐపీఎల్ నిర్వహించడం ఎంత వరకు కరెక్ట్...’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఆలెన్ బోర్డర్.
undefined
ఐసీసీ చేయలేకపోయిన పనిని బీసీసీఐ పక్కాగా చేసి చూపించిందని చెప్పిన బోర్డర్... ఐపీఎల్‌కి ఏ దేశం కూడా క్రికెటర్లను పంపించకూడదని సూచనలు చేశాడు..
undefined
‘నిజం చెప్పాలంటే ఐపీఎల్ వల్ల నేను సంతోషంగా లేను. ఇలాంటి లీగ్‌లకి బదులు వరల్డ్‌కప్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి... ఐపీఎల్‌ బదులు టీ20 వరల్డ్‌కప్ నిర్వహించి ఉంటే బాగుండేది....’ అంటూ చెప్పుకొచ్చాడు బోర్డర్.
undefined
‘ఐపీఎల్ కేవలం డబ్బుల కోసం ఆడే లీగ్. ఇలాంటి లీగ్‌లకు ఆటగాళ్లను పంపిస్తే, వారికి డబ్బులు, గాయాలు తప్ప ప్రపంచక్రికెట్‌కి ఎలాంటి మేలు జరగదు...’ అంటూ తన అభిప్రాయం వెల్లడించాడు బోర్డర్.
undefined
ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆలెన్ బోర్డర్. ‘ఐపీఎల్ వంటి పొట్టి ఫార్మాట్ క్రికెట్ కారణంగా సంప్రదాయ టెస్టు క్రికెట్‌కి ఆదరణ తగ్గిపోయింది. అయితే భారత సారథి విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌ని బతికించగలడు...
undefined
టీ20, వన్డేలతో పాటు టెస్టు మ్యాచులను కూడా బాగా ఆడగల క్రికెటర్ విరాట్ కోహ్లీ... అలాంటి క్రికెటర్లు చాలా మంది కావాలి.
undefined
అదృష్టవశాత్తు విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో ఉన్న కొంతమంది క్రికెటర్లు టెస్టు క్రికెట్ బాగా ఆడుతున్నారు. వీరు సంప్రదాయ క్రికెట్‌ను బ్రతికించగలరు’ అంటూ చెప్పుకొచ్చాడు ఆలెన్ బోర్డర్.
undefined
click me!