విరాట్ కోహ్లీ నమ్మకమే, నాతో అలా బ్యాటింగ్ చేయించింది... సూర్యకుమార్ యాదవ్ కామెంట్...

First Published Mar 22, 2021, 3:29 PM IST

సూర్యకుమార్ యాదవ్... ఇప్పుడు టీమిండియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. బ్యాటింగ్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ తనదైన దూకుడు చూపించి, అభిమానుల మనసు దోచుకున్నాడు సూర్యకుమార్ యాదవ్...

ఆరంగ్రేటం చేసిన రెండో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇషాన్ కిషన్ అదరగొట్టడంతో సూర్యకుమార్ యాదవ్‌కి, ఆ తర్వాతి మ్యాచ్‌లో జట్టులో చోటు కూడా దక్కలేదు...
undefined
అయితే ఇషాన్ కిషన్ గాయపడడంతో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్, నాలుగో టీ20లో సిక్సర్‌ బాది అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. ఆ మ్యాచ్‌లో 57 పరుగులు చేసి, థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో అవుటైన సూర్యకుమార్ యాదవ్, ఆఖరి టీ20లో వన్‌డౌన్‌లో వచ్చాడు...
undefined
17 బంతుల్లో 32 పరుగులు పరుగులు చేసి, ఓ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్‌కి వన్డే జట్టులో కూడా చోటు దక్కింది... తాజాగా తన విజయ రహస్యాన్ని పంచుకుననాడు సూర్యకుమార్ యాదవ్...
undefined
‘నా సక్సెస్‌కి సీక్రెట్ ఏమీ లేదు... ప్రాక్టీస్ గేమ్స్‌లో, నెట్స్‌లో ఆడినట్టే, స్టేడియంలో ఆడాను. దాన్నే అందరూ ఫియర్ లెస్ క్రికెట్ అంటున్నారు.. నా సక్సెస్‌కి అదే కారణం ఏమో...
undefined
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ నాకెంతో సాయం చేసేవాళ్లు. టీమిండియాలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్లు, అదే విధంగా సాయపడుతున్నారు. నేనే ఆడే టీమ్‌లో ముంబై ప్లేయర్లు ఉండడం వల్లేనేమో నేను ఐపీఎల్‌లో ఆడుతున్నా అనే ఫీలింగ్‌తోనే బ్యాటింగ్ చేశాను...
undefined
నిజమే ప్రాక్టీస్ సెషన్స్‌లో బ్యాటింగ్ చేయడం, గ్రౌండ్‌లో దిగి పరుగులు చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది... కానీ టీమిండియా మేనేజ్‌మెంట్, విరాట్ కోహ్లీ నాపై చూపించిన నమ్మకం, నన్ను అలా ఆడేందుకు తోడ్పడింది...
undefined
నేను వన్‌డౌన్‌లో సక్సెస్ కాగలనని విరాట్ కోహ్లీ ఎంతగానో నమ్మాడు. ఆ నమ్మకమే నాలో ఎనర్జీ నింపి, అలా ఆడేలా చేసింది... ఈ స్థానంలో గత మూడేళ్లుగా బ్యాటింగ్ చేస్తున్నా...
undefined
ఏ స్థానంలో ఆడినా నా బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా మార్పు ఉండదు... ఈ పొజిషన్‌లోనే ఆడాలని నేనేమీ కోరుకోవడం లేదు, జట్టుకి అవసరమైతే ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌కి దిగుతా...’ అంటూ కామెంట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్...
undefined
నాలుగో టెస్టులో తాను బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి దిగి, సూర్యకుమార్ యాదవ్‌ను వన్‌డౌన్‌లో పంపించాడు విరాట్ కోహ్లీ. కీలకమైన ఐదో టీ20లో సూర్యకుమార్ యాదవ్‌ను వన్‌డౌన్‌లో ఆడేందుకు తాను ఓపెనర్‌గా మారాడు విరాట్ కోహ్లీ...
undefined
click me!