రహానే కెప్టెన్సీకి ఆస్ట్రేలియా ఫిదా అయిపోయింది... రికీ పాంటింగ్‌తో సహా... సునీల్ గవాస్కర్ కామెంట్...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ... ఇలా స్టార్ క్రికెటర్లు ఎవ్వరూ లేకపోయినా టాప్ టీమ్ ఆస్ట్రేలియాను ఓడించి, బాక్సింగ్ డే టెస్టులో అద్భుత విజయాన్ని అందుకుంది టీమిండియా. తొలి టెస్టులో రెండు రోజుల ఆధిక్యం తర్వాత ఘోర పరాజయం చెందిన టీమిండియా, టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ అవుతుందని భావించారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత విజయం అందుకుంది భారత జట్టు.

తొలి టెస్టు పరాజయం తర్వాత టీమిండియా ఒక్క టెస్టు కూడా గెలవలేదని, 4-0 తేడాతో క్లీన్ స్వీప్ అవుతుందని కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ వాన్...
విరాట్ కోహ్లీ లేకుండా టెస్టు మ్యాచ్ గెలిస్తే, టీమిండియా ఏడాది మొత్తం సంబరాలు చేసుకోవచ్చని చులకనగా కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ హస్సీ...

రికీ పాంటింగ్, షేన్ వార్న్ కూడా బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా పరాజయం తప్పదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేసింది భారత జట్టు...
‘రహానే జట్టును నడిపిస్తున్న విధానాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ప్రశంసించడం నాకెంతో నచ్చింది... కామెంటరీ బాక్సులో ఉన్న ఆసీస్ మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైక్ హస్సీ, షేన్ వార్న్... అజింకా రహానే కెప్టెన్సీని పొడుగుతున్నారు...
భారత జట్టు ఆడుతున్న విధానం చూసిన తర్వాత వారికి రహానేని ప్రశంసించడం తప్ప మరో ఛాయిస్ లేకుండా పోయింది...
రహానే స్టాండ్ ఇన్ కెప్టెన్... స్టాండ్ ఇన్ కెప్టెన్ అయినా లేక స్టార్ ఇన్ బ్యాట్స్‌మెన్ అయినా లేదా కొత్త బంతి బౌలర్ అయినా... మనకి అవకాశం వచ్చినప్పుడు మన బెస్ట్ ఇవ్వడానికి రెఢీగా ఉండాలి...అవకాశం వచ్చినప్పుడు తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి వెనకాడకూడదు... రహానే అలాంటి క్రికెటర్...
మొదటి టెస్టు గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఫిక్స్ అయిపోయారు... విరాట్ లేని భారత జట్టును తక్కువ అంచనా వేశారు...
భారత జట్టు అలా తలవంచదు... ఇప్పుడు ఆస్ట్రేలియాకి సమస్యలున్నాయి. ఓపెనర్లను మార్చాలి, వికెట్లు తీయగల బౌలర్లను వెతకాలి... ఇండియాకి కూడా కొన్ని సమస్యలున్నాయి...
ఓపెనింగ్ ఎక్కువగా పరుగులు జోడించడం లేదు, మిడిల్ ఆర్డర్‌లోనూ సమస్యలున్నాయి... అయితే బౌలింగ్‌లో వారికి ఎలాంటి సమస్యా లేదు...’ అంటూ సవివరంగా చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్.
టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే 4-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేస్తుందని వ్యాఖ్యానించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ వాన్... ఇప్పుడు 3-1 తేడాతో ఆసీస్ సిరీస్ సొంతం చేసుకుంటుందని అభిప్రాయపడ్డాడు.
బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించినంత మాత్రం సిరీస్ గెలిచేంత సీన్ అజింకా రహానే సారథ్యంలోని భారత జట్టుకి లేదని ఇప్పటికీ నమ్ముతున్నట్టు తెలిపాడు మైకేల్ వాన్.
‘విరాట్, రోహిత్, ఇషాంత్, షమీ లేకుండా టెస్టు మ్యాచ్ గెలవడం నిజంగా చాలా గొప్ప అఛీవ్‌మెంట్. మొదటి టెస్టు పరాజయం తర్వాత భారత జట్టు తిరిగి వచ్చిన విధానం నాకెంతో నచ్చింది... బ్రిలియెంట్ విన్... వెల్‌ డన్ టీమిండియా...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్.

Latest Videos

click me!