కష్టపడ్డ.. రంజీలు ఆడిన.. ఐపీఎల్‌లో కొడుతున్న.. సక్సెస్ అయిన! రహానే సక్సెస్ మంత్ర ఇదే..

Published : Apr 25, 2023, 12:31 PM ISTUpdated : Apr 25, 2023, 12:33 PM IST

Ajinkya Rahane: టీమిండియా వెటరన్  బ్యాటర్ అజింక్యా రహానే   తిరిగి టీమ్ లో చోటు దక్కించుకున్నాడు.  17 నెలల తర్వాత అతడు మళ్లీ  మెన్ ఇన్ బ్లూ తో కలిసి ఆడబోతున్నాడు. 

PREV
17
కష్టపడ్డ.. రంజీలు ఆడిన.. ఐపీఎల్‌లో కొడుతున్న.. సక్సెస్ అయిన! రహానే సక్సెస్ మంత్ర ఇదే..

ఏడాదిన్నర తర్వాత అజింక్యా రహానే  తిరిగి టీమిండియాలోకి వచ్చాడు. పేలవ ప్రదర్శనల కారణంగా రెండేండ్ల పాటు   జట్టులో ‘భరించిన’ టీమిండియా.. 2022లో  దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత  మాత్రం కొరడా ఝుళిపించింది.  ‘రహానే నీ సేవలకు ఇక సెలవు..!అని సాగనంపింది.   టీమిండియా వెటరన్ స్టార్లు ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా,  హనుమా విహారి వంటి వాళ్లందరికీ ఫుల్ స్టాప్ పెట్టింది  కూడా  అప్పుడే. 

27

బీసీసీఐ తనను పక్కనబెట్టినా  రహానే ఏం కుంగిపోలేదు.  తన లోపాలు  ఎక్కడున్నాయో తెలుసుకున్నాడు.  మిగిలిన క్రికెటర్లంతా  ఐపీఎల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే  అతడు మాత్రం తనను తాను మెరుగుపరుచుకోవాలనుకున్నాడు.   ఎక్కడ సానబడాలో అతడికి తెలుసు.  టీమిండియాలో ప్లేస్ కోల్పోయిన వెంటనే దేశవాళీలోకి దూకాడు.  

37

రహానే రాకతో  ముంబై రంజీ టీమ్   కూడా అతడికే పగ్గాలు అప్పజెప్పింది. ఏడాదికాలంగా ముంబై టీమ్ కు అతడే సారథి. ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారేలలో ముంబైని నడిపించాడు.  జట్టుగా ఈ ఏడాదికాలంలో ముంబై అద్భుతాలేమీ చేయలేకపోయినా  వ్యక్తిగతంగా  రహానే మాత్రం మెరుగైన ప్రదర్శనలే చేశాడు.   

47

గత రంజీ సీజన్  (2022- 2023) లో  రహానే.. ముంబై తరఫున ఏడు మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 11 ఇన్నింగ్స్ లో 634 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రహానే సగటు  57.64గా నమోదైంది.  ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.  

57

ఇక  రంజీలు ముగిసిన తర్వాత ఐపీఎల్  లో కూడా అదరగొడుతున్నాడు ఈ ముంబై  బ్యాటర్. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రహానే.. ఆడిన ఐదు మ్యాచ్ లలోనే  209  పరుగులతో  దుమ్మురేపుతున్నాడు.  

67
Image credit: PTI

సీఎస్కే ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గాయంతో టీమ్ లో చోటు దక్కించుకున్న రహానే గడిచిన ఐదు మ్యాచ్ లలో  71  నాటౌట్, 9, 37, 31, 61    పరుగులతో  నిలకడైన ప్రదర్శనలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్ రేట్ కూడా మెరుగ్గా (199)నే  ఉంది.    చెన్నై విజయాల్లో  అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

77
Image credit: PTI

అటు దేశవాళీలతో పాటు ఇటు ఐపీఎల్ లో కూడా  రాణిస్తున్న రహానే  తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్  లో కూడా చోటు దక్కించుకోవడం విశేషం. మిడిలార్డర్ లో  అతడు కీలకం కానున్నాడు. అయతే  కెఎల్ రాహుల్ ను ఆడిస్తే  రహానే  తుది  జట్టులో చోటు దక్కించుకుంటాడా..? లేదా..? అన్నది అనుమానమే.   ఒకవేళ  కెఎస్ భరత్ ను బెంచ్ కే పరిమితం చేసి    రాహుల్ ను వికెట్ కీపర్ బ్యాటర్ గా వాడుకుంటే మాత్రం రహానే  టీమ్ లోకి వస్తాడు. 

click me!

Recommended Stories