బాబూ బ్రూక్.. ఒక్క ఇన్నింగ్స్‌కే ఇండియన్ ఫ్యాన్స్ నోర్మూయించిన అంటివి! ఇదేనా ఆట..?

Published : Apr 25, 2023, 11:09 AM IST

IPL 2023:  సన్ రైజర్స్ హైదరాబాద్  ఓపెనర్  హ్యారీ బ్రూక్ దారుణ వైఫల్యాలు వ్యక్తిగతంగా ఎంత నష్టపరుస్తున్నాయో తెలియదు గానీ సన్ రైజర్స్ మాత్రం దారుణమైన మూల్యం చెల్లించుకుంటున్నది. 

PREV
16
బాబూ బ్రూక్.. ఒక్క ఇన్నింగ్స్‌కే ఇండియన్ ఫ్యాన్స్ నోర్మూయించిన అంటివి! ఇదేనా ఆట..?

ఇంగ్లాండ్  యువ సంచలనం,   ఐపీఎల్ -16లో  సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న  హ్యారీ బ్రూక్  వరుస వైఫల్యాలు   జట్టును దారుణంగా దెబ్బతీస్తున్నాయి.  ఈ సీజన్ కు ముందు నిర్వహించిన వేలంలో బ్రూక్‌ను  సన్ రైజర్స్  రూ. 13.25 కోట్లు   పెట్టి  కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో అతడు  దానికి న్యాయం చేసింది ఒకటే ఒక మ్యాచ్. 

26
Image credit: PTI

ఐపీఎల్-16లో  సన్ రైజర్స్ ఆడిన   ఏడు మ్యాచ్ లలోనూ   బ్రూక్ ఆడాడు.  ఒక్క కోల్కతా నైట్ రైడర్స్ తో  తప్ప మిగిలిన ఆరింటిలోనూ  అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు.  కేకేఆర్ తో మ్యాచ్ లో బ్రూక్.. 55 బంతుల్లో సెంచరీ చేశాడు.కానీ దానికి ముందు, దాని తర్వాత అన్నీ వైఫల్యాలే. 

36

బ్రూక్ ఈ సీజన్ లో  ఏడు మ్యాచ్ లలో  చేసిన స్కోర్లను  చూస్తే.. రాజస్తాన్ పై 13,  లక్నోపై  3, పంజాబ్ పై 13, కోల్కతాపై 100 నాటౌట్, ముంబైపై  9, చెన్నైపై 18 పరుగులు చేశాడు. నిన్న ఉప్పల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్  లో   బ్రూక్..  14 బాల్స్ ఆడి  7 పరుగులే చేశాడు.  

46

అంటే మొత్తంగా   ఏడు మ్యాచ్ లలో బ్రూక్  చేసినవి 163 పరుగులు. ఇందులో ఏదో గుడ్డిలా మెల్లలా వచ్చిన కేకేఆర్ తో సెంచరీ తీసేస్తే   చేసినవి  63 మాత్రమే.  ప్రతీ మ్యాచ్ లో  సెంచరీలు చేయమని  కోరుకోకున్నా మినిమం ఆట అయినా ఆడితే  సన్ రైజర్స్ కు మంచి ఆరంభాలు దక్కేవి.  కానీ బ్రూక్ మాత్రం వరుసగా  నిరాశపరుస్తున్నాడు.  

56

సరే పోనీ, ఆడట్లేదు నోరైనా కంట్రోల్ లో పెట్టుకున్నాడా..? అంటే అదీ లేదు. లక్ కలిసొచ్చి కోల్కతాతో   మ్యాచ్ లో సెంచరీ చేసిన  తర్వాత   మాట్లాడిన మాటలు ఇండియన్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాయి.  ఆ మ్యాచ్  ముగిశాక పోస్ట్ మ్యాచ్ ప్రెజంటేషన్ లో  బ్రూక్ మాట్లాడుతూ.. ‘నా ప్రదర్శన పట్ల  హ్యాపీగా ఉన్నా. ఇప్పటిదాకా  నేను సరిగా ఆడలేదని నన్ను ట్రోల్ చేశారు.  నా ఈ ప్రదర్శనతో  ఇండియన్ ఫ్యాన్స్ నోళ్లు మూయించా..’అని కామెంట్ చేశాడు. 

66

ఇది భారత అభిమానులకు  ఎక్కడో కాలింది. అసలే ఇంగ్లాండ్ ఆటగాడు.  టన్నుల కొద్దీ పరుగులు చేసిన డేవిడ్ వార్నర్,  రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలు కూడా ట్రోలర్స్ పై ఎప్పుడూ ఇలా నోరు జారలేదు.   కానీ బ్రూక్ అలా అనడంతో వారికి చిర్రెత్తుకొచ్చింది. సెంచరీ తర్వాత మళ్లీ విఫలమవుతున్న బ్రూక్ పై   ట్రోలర్స్ కసి తీర్చుకుంటున్నారు. 

click me!

Recommended Stories