ధోనీ, అతన్ని రిమోట్ కంట్రోల్‌లా వాడుతున్నాడు! వదిలేస్తే... మురళీ కార్తీక్ కామెంట్...

First Published Apr 29, 2023, 10:37 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌తో మహేంద్ర సింగ్ ధోనీ, పూర్తిగా అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఖరారు చేశాడు మాహీ. గత సీజన్‌లో 9వ స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి ప్లేఆఫ్స్ రేసులో దూసుకుపోతోంది...

దీపక్ చాహార్, బెన్ స్టోక్స్ గాయపడి రిజర్వు బెంచ్‌లో కూర్చున్నా, శ్రీలంక బౌలర్లు మహీశ్ తీక్షణ, మతీశ పథిరాణాలను అద్భుతంగా వాడుకుంటూ, అదిరిపోయే రిజల్ట్ రాబడుతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...
 

‘తీక్షణ కంటే మిచెల్ సాంట్నర్‌కి అనుభవం ఎక్కువ. అంతేకాదు అతను మ్యాచ్ విన్నర్‌గా చాలాసార్లు నిరూపించుకున్నాడు. పథిరాణాని ధోనీ అద్భుతంగా వాడుకుంటున్నాడు. అతన్ని డెత్ ఓవర్లలో వాడుకోవచ్చు...

Latest Videos


Image credit: PTI

నా వరకూ ఇప్పటిదాకా చూసిన దానిప్రకారం మతీశ పథిరాణా, ధోనీ చేతిలో రిమోట్ కంట్రోల్‌లా మారిపోయాడు. ధోనీ ఏం చెబితే పథిరాణా అదే చేస్తున్నాడు. అతన్ని టీమ్ నుంచి తప్పించలేం. తప్పించాల్సిన అవసరం కూడా లేదు...

పథిరాణా, వేరే టీమ్‌లోకి వెళితే ఇలాగే ఆడతాడని ఆశించకూడదు.ఎందుకంటే ధోనీ సూచనలు లేకుండా పథిరాణా ఇలాగే ఆడతాడా? ఆడగలడా? అనేది ఇంకా నిరూపితం కాలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కి సీమ్ బౌలింగ్‌ వీక్‌గా మారింది...

ఆకాశ్ సింగ్ బాగానే వేస్తున్నాడు. గత మ్యాచ్‌లో బ్యాక్ టు బ్యాక్ నాలుగు ఓవర్లు వేసి మెప్పించాడు. అయితే ఏ బ్యాటర్‌నైనా అవుట్ చేయగల మిచెల్ సాంట్నర్ లాంటి బౌలర్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు...

మిచెల్ సాంట్నర్‌ని ప్లేఆఫ్స్‌ కోసం దాచిపెడుతున్నట్టు ఉన్నారు. అయితే లీగ్ మ్యాచుల్లో గెలిస్తే కదా, ప్లేఆఫ్స్ చేరేదే. అతని మణికట్టు మ్యాజిక్‌ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే ధోనీ ఆటను చూసే విధానం వేరుగా ఉంటుంది..  అతని ఆలోచన ఏంటో?’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ స్పిన్నర్, కామెంటేటర్ మురళీ కార్తీక్..
 

click me!