టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ బంగ్లాదేశ్ టూర్ కు వెళ్లాల్సి ఉంది. న్యూజిలాండ్ పర్యటన ముగిశాక భారత జట్టు.. బంగ్లాతో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ రెండు సిరీస్ లలోనూ రాహుల్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ పర్యటన ముగిసిన తర్వాత రాహుల్ - అతియాల వివాహం ఉంటుందని తెలుస్తున్నది.