పాకిస్తాన్‌కు మరో షాక్.. ఆస్పత్రి పాలైన స్టార్ పేసర్.. టీ20 ప్రపంచకప్‌కు ముందు పాక్‌కు వరుస షాకులు

First Published | Sep 28, 2022, 5:37 PM IST

PAK vs ENG T20I: అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా మొదలుకానున్న టీ20 ప్రపంచకప్ కు ముందు పాకిస్తాన్ కు గాయాల బెడద వేధిస్తున్నది.  స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఇప్పటికే ఆ జట్టు ప్రీమియమ్ బౌలర్ షహీన్ షా అఫ్రిది సేవలను కోల్పోయింది. 

స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఏడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ కు మరో షాక్ తగిలింది. కీలక ఆటగాడు షహీన్ షా అఫ్రిది గాయపడటంతో అతడి సేవలను కోల్పోయిన పాక్.. తాజాగా ఈ సిరీస్ లో మిగిలిఉన్న మ్యాచ్ లకు మరో పేసర్ నూ కోల్పోయే ప్రమాదముంది.

Naseem Shah

ఆసియా కప్ ద్వారా  వెలుగులోకి వచ్చిన నసీమ్ షా.. షహీన్ లేని లోటును భర్తీ చేస్తున్నాడు.  ఈ యువ బౌలర్ ఆసియా కప్ లో మెరుగైన ప్రదర్శనలతో టీ20 ప్రపంచకప్ లో కూడా చోటు దక్కించుకున్నాడు.


ఇంగ్లాండ్ తో ఏడు మ్యాచ్ ల సిరీస్ లోనూ స్థానం దక్కించుకున్న  నసీమ్ షా.. ఐదో టీ20కి ముందు  ఆస్పత్రి పాలయ్యాడు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నసీమ్ ను లాహోర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి అక్కడే చికిత్స అందిస్తున్నారు. 

Naseem Shah

ఐదో మ్యాచ్ కోసం  సోమవారమే లాహోర్ చేరుకున్న నసీమ్ షా మంగళవారం ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొన్నాడు. అయితే  మంగళవారం రాత్రి అతడికి జ్వరంతో పాటు ఛాతీలో  ఇన్ఫెక్షన్ రావడంతో  హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా ధృవీకరించింది. 

అయితే నసీమ్  ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని, అతడు కోలుకుంటున్నాడని పీసీబీ చెబుతున్నా  వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు. ఆసియా కప్ లో గాయమైన నసీమ్ షాను  పాక్ పేస్ బౌలింగ్ వీక్ గా ఉండటంతో గత్యంతరం లేక ఆడించారు. 

ఈ మెగా టోర్నీలో నసీమ్ తప్ప  పేసర్లుగా ఉన్న షహన్వాజ్ దహానీ, హరీస్ రౌఫ్  పెద్దగా ప్రభావం చూపలేదు. భారత్ తో తొలి మ్యాచ్ లో నసీమ్ రాణించాడు. ఆ తర్వాత కూడా అదే ప్రదర్శనను కొనసాగించాడు. ఇక  సూపర్-6లో అఫ్గానిస్తాన్ తో మ్యాచ్ లో చివరి బంతికి సిక్సర్ కొట్టి పాకిస్తాన్ కు  చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.  కానీ ఇంగ్లాండ్ సిరీస్ లో అతడు తన మార్కును చూపించలేకపోయాడు. 

ఇక నాలుగు టీ20లు ముగిసిన  ఈ సిరీస్ లో రెండు జట్లు తలా రెండు మ్యాచ్ లు గెలిచి సమంగా ఉన్నాయి. సిరీస్ చేజిక్కించుకోవడానికి ఈ  మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానున్నది. ఈ మ్యాచ్ లో గెలిచి ఆధిక్యాన్ని  3-2కు  పెంచుకోవాలని పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఆరాటపడుతున్నాయి. 
 

Latest Videos

click me!