వామ్మో అదే జరిగితే భారత్‌కు కప్ గోవిందా..? టీమిండియా ఫ్యాన్స్ లో మొదలైన ఆందోళన

First Published | Nov 8, 2022, 12:01 PM IST

T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో  సూపర్-12 దశ ముగియగా  రేపటి నుంచి సెమీఫైనల్స్ మొదలుకానున్నాయి.   ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ లు సెమీస్ లో తలపడుతాయి. 

టీ20 వరల్డ్ కప్ దాదాపు తుది అంకానికి చేరింది.  ఈ మెగా టోర్నీలో భారత జట్టుతో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ కూడా సెమీస్ చేరిన విషయం తెలిసిందే. నవంబర్ 9న న్యూజిలాండ్ - పాకిస్తాన్,  నవంబర్ 10 న  ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతాయి. అయితే సెమీస్ మ్యాచ్ లకు ముందు టీమిండియా ఫ్యాన్స్ కు ఓ భయం పట్టుకుంది. 

1992 వన్డే ప్రపంచకప్  సెంటిమెంట్ టీమిండియా అభిమానులను కలవరపెడుతున్నది.  పాక్ అభిమానులు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్న  ఈ సెంటిమెంట్ గనక రిపీట్ అయితే టీమిండియాకు భారీ షాక్ తప్పదు.  ఆ సెంటిమెంట్ ఏంటో ఇక్కడ చూద్దాం. 

Latest Videos


1992 వన్డే ప్రపంచకప్ కూడా  ఆస్ట్రేలియాలోనే జరిగింది. అప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న ఆసీస్.. టోర్నీలో సెమీస్ చేరలేదు. సెమీస్ కు భారత్, పాక్ తో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. సెమీస్ లో పాకిస్తాన్.. భారత్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది.  ఫైనల్లో ఇంగ్లాండ్ ను ఓడించి కప్ కొట్టింది. 

Image credit: Getty

2022 టీ20 ప్రపంచకప్ లో కూడా దాదాపు ఇవే సమీకరణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.  గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టోర్నీ ఆడినా  సెమీస్ కు చేరలేదు. అప్పటిలాగా భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీస్ చేరాయి.   
 

ఇప్పుడు సెమీస్ లో ప్రత్యర్థులు మారినా  భారత్  ను ఇంగ్లాండ్ ఓడించి ఆ తర్వాత  ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడుతుందని, తద్వారా బాబర్ సేన మరోసారి జగజ్జేతగా నిలుస్తుందని పాక్ ఫ్యాన్స్  అంచనాలు కడుతున్నారు. ఈ సెంటిమెంట్ ఇప్పుడు భారత్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తున్నది.  

సెంటిమెంట్ల సంగతి అటుంచితే  ఫైనల్ కు ఏ జట్లు వెళ్తాయి..? ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారు అనేది ఈనెల 13న తేలనుంది. అదృష్టం కలిసివచ్చి  సెమీస్ కు చేరిన పాకిస్తాన్.. సెమీస్ లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం.  టీ20 లలో నెదర్లాండ్స్.. సౌతాఫ్రికాను ఓడించడం, జింబాబ్వే పాకిస్తాన్ కు షాకివ్వడం వంటి సంచలనాలను చూసి కూడా ఇటువంటి సెంటిమెంట్లను నమ్మి ముందుకెళ్తే బొక్కబోర్లా పడటం ఖాయం.. 

click me!