వాళిద్దరూ రిటైర్ అయితే టీమిండియాకి కూడా శ్రీలంకకి పట్టిన గతేనా! వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌తో తేలిన...

Published : Jul 30, 2023, 10:12 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు, వెస్టిండీస్ టూర్‌కి వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కూడా అర్హత సాధించలేని వెస్టిండీస్‌పై సీనియర్లను పంపడం కంటే జూనియర్లకు అవకాశం ఇస్తే, అంతర్జాతీయ అనుభవం వచ్చి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు..

PREV
19
వాళిద్దరూ రిటైర్ అయితే టీమిండియాకి కూడా శ్రీలంకకి పట్టిన గతేనా! వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌తో తేలిన...

టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చేసుకున్న సెంచరీలను కూడా తక్కువ చేసి మాట్లాడాడు. వారి గణాంకాలను మెరుగుపర్చుకోవడానికే ఫామ్‌లో లేని వెస్టిండీస్‌పై సెంచరీలు చేశారంటూ ఎద్దేవా చేశాడు.. అయితే గవాస్కర్ అన్నట్టుగా వెస్టిండీస్ టూర్‌లో సీనియర్లకు రెస్ట్ ఇచ్చి ఉంటే ఏమయ్యేదో వన్డే సిరీస్ ద్వారా తేలిపోయింది..

29
India vs West Indies

ఫ్యూచర్ స్టార్లు, భావి దిగ్గజ ప్లేయర్లు అంటూ ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు పెట్టుకున్న యంగ్ క్రికెటర్లు, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో చేతులు ఎత్తేస్తున్నారు... శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్.. ఇలా మ్యాచ్ విన్నర్లుగా పేరు తెచ్చుకున్న ప్లేయర్లు అందరూ ముకుమ్మడిగా ఫెయిల్ అవుతున్నారు. 

39

మహేళ జయవర్థనే, కుమార సంగర్కర, తిలకరత్నే దిల్షాన్, లసిత్ మలింగ వంటి సీనియర్లు రిటైర్ అయ్యాక శ్రీలంక... వరల్డ్ కప్ టోర్నీలకు కూడా నేరుగా అర్హత సాధించలేని దారుణ పరిస్థితులను చూస్తోంది...

49
India vs West Indies

లంక ప్రస్తుతం ఎలాంటి దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో, రాబోయే రెండు మూడేళ్లలో భారత జట్టుకి కూడా అదే గతి తప్పదా? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోతే టీమిండియా పరిస్థితి ఇంతేనా?  వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్ ఇలాంటి అనుమానాలను రేకెత్తిస్తోంది. టీమిండియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లపైనే ఎంతగా ఆధారపడి ఉందో ఈ సిరీస్ అందరికీ అర్థమయ్యేలా చేసింది..

59

ఇండియాలో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడబోతున్న భారత జట్టు, వెస్టిండీస్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేయడం ఎందుకో? క్రికెట్ ఫ్యాన్స్‌కి అర్థం కావడం లేదు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకుంటే, టీమిండియా ఫ్యూచర్‌ ఎలా ఉంటుందో ముందుగానే టెస్టు చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా రేగుతున్నాయి..

69

ఈ వన్డే సిరీస్‌లో ప్రయోగాలు పక్కనబెడితే, క్రికెట్ ఫ్యాన్స్‌కి ఓ విషయం మాత్రం క్లియర్‌గా అర్థమైంది. ఇప్పటికిప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ రిటైర్ అయితే భారత జట్టు, ఐసీసీ టోర్నీలు గెలవడం సంగతి పక్కనబెడితే.. ద్వైపాక్షిక సిరీసుల్లో కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. 

79

స్కాట్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే వంటి అసోసియేట్ దేశాలపై వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ గెలవలేకపోయిన వెస్టిండీస్ చేతుల్లోనే చిత్తుగా ఓడిన యంగ్ ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ వంటి టీమ్స్‌ని వారి దేశాల్లో ఫేస్ చేయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే..

89

2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ లేకపోయినా... రోహిత్ శర్మ పెద్దగా ఆడకపోయినా, అజింకా రహానే కెప్టెన్సీలో, రవిశాస్త్రి కోచింగ్‌లో రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, నటరాజన్ వంటి కుర్రాళ్లు మ్యాజిక్ చేశారు. 32 ఏళ్లుగా చెక్కుచెదరని బ్రిస్బేన్ కోటను కూల్చి, గబ్బాలో ఆస్ట్రేలియాకి పరాజయాన్ని రుచి చూపించారు...
 

99

ప్రసిద్ధ్ కృష్ణ, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్... ఇలా టీమిండియా రిజర్వు బెంచ్‌ని చూసి,  ఆస్ట్రేలియా వంటి టీమ్స్ కూడా ఆశ్చర్యపోయాయి. కానీ రవిశాస్త్రి కోచింగ్‌లో బుల్లెట్‌లా దూసుకుపోయిన కుర్రాళ్లే, ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో తాబేళ్లలా మారిపోవడం... టీమిండియా ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరుస్తోంది.   

Read more Photos on
click me!

Recommended Stories