వరల్డ్ కప్‌ మ్యాచులకు ఇ-టికెట్స్‌ అనుమతించం! టీమిండియా ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన బీసీసీఐ...

Published : Jul 29, 2023, 08:00 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ టోర్నీ, నవంబర్ 19న ముగియనుంది. ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. అయితే తాజాగా ఈ టోర్నీకి సంబంధించి ఓ షాకింగ్ విషయం బయటపెట్టాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...  

PREV
16
వరల్డ్ కప్‌ మ్యాచులకు ఇ-టికెట్స్‌ అనుమతించం! టీమిండియా ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన బీసీసీఐ...

లాక్‌డౌన్ ముందు నుంచి టికెట్ విక్రయాలను ఆన్‌లైన్ ద్వారా చేస్తోంది బీసీసీఐ. సినిమా టికెట్ల నుంచి పార్కింగ్ టికెట్ల ద్వారా అన్నీ ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్న నేటి డిజిటల్ యుగంలో ఇ-టికెట్లతో ఎంట్రీ ఉండదని షాకింగ్ ప్రకటన చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..
 

26

దేశంలోని 10 నగరాల్లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మ్యాచులు జరగబోతున్నాయి. ఇప్పటికే వరల్డ్ కప్ మ్యాచులు జరిగే నగరాల్లో హోటల్ గదులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.. హోటల్ గదులను కూడా ఆన్‌లైన్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు అభిమానులు..

36

అయితే 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఈ- టికెట్స్‌కి అనుమతి లేదని అంటున్నాడు జై షా. స్టేడియంలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఫిజికల్ టికెట్ తీసుకురావడం తప్పనిసరి. టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా, ప్రింట్ అవుట్‌తో స్టేడియానికి రావాల్సి ఉంటుంది..
 

46

‘వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఇ-టికెట్స్‌ని ఉపయోగించడం వీలయ్యే పని కాదు. కచ్ఛితంగా ఫిజికల్ టికెట్స్ తీసుకురావాల్సి ఉంటుంది. స్టేడియాల దగ్గర ఫిజికల్ టికెట్ల విక్రయం కూడా చేపడతాం...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా..

56
Image credit: Getty

‘అహ్మదాబాద్, లక్నో లాంటి నగరాల్లో స్టేడియానికి లక్షలాది మంది వస్తారు. అలాంటి సందర్భాల్లో ఫిజికల్ టికెట్ లేకుండా ఈటికెట్ ఎంట్రీ అమలు చేయడం చాలా కష్టం. ద్వైపాక్షిక సిరీసుల్లో ఈ ఇ-టికెట్ ఎంట్రీ, చాలా నగరాల్లో ఇంకా మొదలెట్టలేదు...’ అంటూ కామెంట్ చేశాడు జై షా.. 
 

66
Image credit: Getty

రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లతో బీసీసీఐ త్వరలో మీటింగ్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో వరల్డ్ కప్ 2023 టోర్నీ టికెట్ల ధరలను నిర్ణయించబోతున్నట్టు ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా.. 

click me!

Recommended Stories