మళ్లీ సిమ్రాన్ హెట్మయన్‌ని పట్టించుకోని విండీస్... టీ20 వరల్డ్ కప్‌లో చిత్తుగా ఓడినా...

Published : May 12, 2023, 01:17 PM IST

ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్, ఇప్పుడు అతిపెద్ద మిస్టరీ టీమ్‌గా మారింది. రెండుసార్లు వన్డే వరల్డ్ కప్, రెండు సార్లు టీ20 వరల్డ్ కప్స్ సాధించిన వెస్టిండీస్, పేలవ ప్రదర్శన కారణంగా ఈసారి క్వాలిఫైయర్స్ ఆడనుంది..  

PREV
17
మళ్లీ సిమ్రాన్ హెట్మయన్‌ని పట్టించుకోని విండీస్... టీ20 వరల్డ్ కప్‌లో చిత్తుగా ఓడినా...
keemo paul

2023 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌ని టీమ్‌ని ప్రకటించింది వెస్టిండీస్. జింబాబ్వేలో జూన్ నెలలో జరిగే  క్వాలిఫైయర్స్‌కి వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ కిమో పాల్‌కి తిరిగి పిలుపు దక్కింది.. 2022 జూలై తర్వాత టీమ్‌కి దూరంగా ఉన్న కిమో పాల్, దాదాపు ఏడాది తర్వాత తిరిగి వన్డేలు ఆడబోతున్నాడు..

27
hetmayer

వన్డే వరల్డ్ కప్‌కి నేరుగా అర్హత సాధించేందుకు నిర్వహించిన వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో 9వ స్థానంలో నిలిచిన వెస్టిండీస్, సౌతాఫ్రికా కంటే 10 పాయింట్ల తక్కువ రావడంతో క్వాలిఫైయర్స్ ఆడాల్సిన పరిస్థితుల్లో పడింది..

37
Sanju Samson and Shimron Hetmyer

అయితే వెస్టిండీస్ హిట్టర్ సిమ్రాన్ హెట్మయర్‌కి ఈ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కకపోవడం విశేషం. 2022 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఫ్లైట్ టైమ్ కంటే లేటుగా వచ్చాడని హెట్మయర్‌ని టీమ్ నుంచే తప్పించింది వెస్టిండీస్...

47

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించి ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది వెస్టిండీస్. గ్రూప్ బీలో 3 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకున్న వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్ వంటి పసి కూనల చేతుల్లో చిత్తుగా ఓడింది..
 

57

ఐపీఎల్‌ ఆడుతున్న రోవ్‌మెన్ పావెల్, జాసన్ హోల్డర్, అకీల్ హుస్సేన్, అల్జెరీ జోసఫ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రొమారియో షెఫర్డ్ వంటి వెస్టిండీస్ ప్లేయర్లు, గ్రూప్ మ్యాచుల తర్వాత టోర్నీ నుంచి తప్పుకోవాల్సిందిగా సూచించింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు...
 

67

ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో చివరి 5 స్థానాల్లో నిలిచిన ఐర్లాండ్, నెదర్లాండ్స్, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వేతో లీగ్ 1లో నిలిచిన నేపాల్, ఓమన్, స్కాట్లాండ్, క్వాలిఫైయర్ ప్లేఆఫ్ గెలిచిన యూఏఈ, యూఎస్ టీమ్స్ కలిసి ఈ క్వాలిఫైయర్ ఆడతాయి. ఈ టోర్నీలో టాప్ 2లో నిలిచిన టీమ్స్, నేరుగా వరల్డ్ కప్‌కి క్వాలిఫై అవుతాయి..

77

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్: షై హోప్ (కెప్టెన్), రోవ్‌మెన్ పావెల్, షెమ్రా బ్రూక్స్, యానిక్ కరయా, కెసీ కర్టీ, రోస్టన్ ఛేజ్, జాసన్ హోల్డర్, అకీల్ హుస్సేన్, అల్జెరీ జోసఫ్, బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోర్టీ, కీమో పాల్, నికోలస్ పూరన్, రొమారియో షెఫర్డ్
 

click me!

Recommended Stories