ఐపీఎల్ 2023 సీజన్‌లో పాల్గొనడానికి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం డబ్బులు మాత్రమే కాదు, ఈ సారి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇండియాలో జరగబోతుండడం కూడా...
బేస్ ప్రైజ్‌కి అమ్ముడుపోయిన కేన్ విలియంసన్, జో రూట్ వంటి స్టార్ ప్లేయర్లు ఈ కారణంగానే ఐపీఎల్ ఆడేందుకు ఇండియాకి వచ్చాడు.. అయితే వన్డే వరల్డ్ కప్‌కి టైం దగ్గర పడుతున్నా ఇంకా షెడ్యూల్ గురించి క్లారిటీ రాలేదు..
28
జూన్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఆగస్టులో ఆసియా కప్ టోర్నీ, సెప్టెంబర్- అక్టోబర్ మాసాల్లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా షెడ్యూల్ విడుదల కాకపోవడానికి ప్రధాన కారణం ఆసియా కప్ 2023 టోర్నీ వల్ల ఏర్పడిన గందరగోళ పరిస్థితే..
38
Image credit: Wikimedia Commons
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆసియా కప్ 2023 టోర్నీకి పాకిస్తాన్ వేదిక ఇవ్వాలి. అయితే పాక్‌లో జరిగితే ఇండియా ఆసియా కప్ ఆడదని బెట్టు చేస్తోంది. వేరే దేశంలో ఆసియా కప్ నిర్వహిస్తే తాము ఆడబోమని హెచ్చరించిన పాకిస్తాన్, ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా పాల్గొనబోమని చెప్పింది..
48
ఈ కామెంట్ల కారణంగానే ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ ఆలస్యం అవుతున్నట్టు సమాచారం. వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఆడుతుందా? లేదా? అనేది తేలకుండా షెడ్యూల్ ఫిక్స్ చేయడం వీలు కాదు. దీంతో ఐసీసీ, పీసీబీకి ఈ విషయాన్ని త్వరగా తేల్చాల్సిందిగా కోరుతూ లేఖ రాసిందట..
58
పాకిస్తాన్, ఇండియా వెళ్తుందని తేలితే ఈ రెండు జట్ల మధ్య వేదిక, మ్యాచ్ తేదీలు ఖరారు అయిపోతాయి. ఒకవేళ పాకిస్తాన్, పట్టు వదలకుండా వన్డే వరల్డ్ కప్ ఆడకూడదని డిసైడ్ అయితే ఆ జట్టు లేకుండా టోర్నీ నిర్వహించేందుకు వీలుగా క్వాలిఫైయర్స్ నుంచి మరో టీమ్‌ని సూపర్ 12 రౌండ్‌లోకి తీసుకురావాల్సి ఉంటుంది..
68
అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ నజం సేథి మాత్రం వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం ఇండియాలో పర్యటించేందుకు పాకిస్తాన్ టీమ్‌కి ప్రభుత్వం నుంచి అనుమతి రాదని కామెంట్ చేశాడు. దీంతో తీవ్ర సందిగ్ధం నెలకొంది..
78
India vs Pakistan
చూస్తుంటే ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహణను పరువు సమస్యగా తీసుకున్న పాక్ క్రికెట్ బోర్డు, భారీగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐతో పంతం నెగ్గించుకోవాలనే ప్రయత్నంలో బెట్టు చేసి, వన్డే వరల్డ్ కప్ నుంచే దూరమయ్యేలా కనిపిస్తోంది...
88
అయితే ఆఖరి వరకూ పంతం పట్టినా తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ జరగడం, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం పాకిస్తాన్, ఇండియాకి రావడం మాత్రం పక్కాగా జరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్..