ఇరగదీశావ్ రా బుడ్డోడా... యశస్వి జైస్వాల్‌పై విరాట్ కోహ్లీ పోస్ట్! కెఎల్ రాహుల్, వార్నర్ ఫిదా...

Published : May 12, 2023, 12:18 PM IST

యశస్వి జైస్వాల్... ఇప్పుడు ఐపీఎల్‌లో బాగా వినిపిస్తున్న పేరు. నిరుపేద కుటుంబం నుంచి క్రికెట్‌లోకి వచ్చిన యశస్వి జైస్వాల్, కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకుని, ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బ్రేక్ చేశాడు...  

PREV
110
ఇరగదీశావ్ రా బుడ్డోడా... యశస్వి జైస్వాల్‌పై విరాట్ కోహ్లీ పోస్ట్! కెఎల్ రాహుల్, వార్నర్ ఫిదా...
Image credit: PTI

యశస్వి జైస్వాల్ సంచలన ఇన్నింగ్స్‌పై క్రికెట్ ప్రపంచం హర్షం వ్యక్తం చేసింది. స్టార్ ప్లేయర్లు, మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు... జైస్వాల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా జైస్వాల్ ఇన్నింగ్స్‌పై పోస్ట్ చేశాడు..

210
Yashasvi Jaiswal

‘వావ్... ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇది. వాట్ ఏ టాలెంట్. స్టార్ యశస్వి జైస్వాల్’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ... 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కెఎల్ రాహుల్, తన రికార్డును బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్‌కి ‘హ్యాట్సాఫ్’ చెబుతున్న ఎమోజీని ట్వీట్ చేశాడు..

310
(PTI05_11_2023_000376B)

‘జైస్వాల్ ఇప్పుడు టీమిండియా సెలక్టర్లకు ఫస్ట్ ఛాయిస్. ఐపీఎల్ తర్వాత అతను ప్రపంచమంతా తిరిగేందుకు సిద్ధంగా ఉండాలి...’ అంటూ బ్రాడ్ హాగ్ ట్వీట్ చేశాడు..
 

410
PTI Photo/Swapan Mahapatra)(PTI05_11_2023_000369B)

‘జైస్వాల్ ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. 2024 వరల్డ్ కప్‌లో అతనే స్పెషల్ అట్రాక్షన్’ అంటూ డేవిడ్ వార్నర్ ట్వీట్ చేయగా, ‘ఇప్పుడు యశస్వి జైస్వాల్ నా ఫెవరెట్ ఇండియన్ యంగ్ బ్యాటర్. అతన్ని ఇండియా జెర్సీలో చూసేందుకు ఎదురుచూస్తున్నా..’ అంటూ ట్వీట్ చేశాడు లసిత్ మలింగ...

510

‘ఓపెనర్లు సాధారణంగా స్పిన్నర్లను ఆడేందుకు ఇబ్బంది పడతారు కానీ జైస్వాల్ అలా కాదు. ఐపీఎల్ నుంచి కుర్రాళ్లు, ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో టీమిండియాలోకి రావడం నాకు నచ్చదు కానీ ఈ కుర్రాడు భారత జెర్సీ వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు..’ అంటూ మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు..

610
Yashasvi Jaiswal

‘వావ్ యశస్వి జైస్వాల్.. ఇప్పుడు ఇతన్ని టీమిండియాలోకి తెచ్చేయండి...’ అంటూ బీసీసీఐని ట్యాగ్ చేశాడు బ్రెట్ లీ. వీరేంద్ర సెహ్వాగ్.. ‘ఈ కుర్రాడు చాలా స్పెషల్. అతని క్లీన్ స్ట్రైయికింగ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేశా...’ అంటూ ట్వీట్ చేశాడు..

710

‘యశస్వి జైస్వాల్ 13 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి, ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు కొట్టాడు. 21 ఏళ్ల కుర్రాడు చరిత్ర తిరగరాశాడు’ అంటూ జులన్ గోస్వామి ట్వీట్ చేసింది...

810
Yashasvi Jaiswal

‘ఇది జైస్వాల్ యశస్వి కూడా, తేజస్వి కూడా’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేయగా, ‘స్పెషల్ ఇన్నింగ్స్, స్పెషల్ ప్లేయర్, టేక్ ఏ బో.. ’ అంటూ ట్వీట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్..

910

‘యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ వేరే లెవెల్. క్లీన్ హిట్టింగ్ అలాగని ఆత్రం లేదు. చూసేందుకు చాలా చక్కగా ఉంది. అతను ఫ్యూచర్‌లో టీమిండియాకి సరైన టీ20 ఓపెనర్ అవుతాడు’ అంటూ ఆర్‌పీ సింగ్ ట్వీట్ చేశాడు..

1010

‘రాబోయే 3 నెలల్లో యశస్వి జైస్వాల్, టీమిండియా జెర్సీ వేసుకుంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతను ఐపీఎల్‌‌లోనే కాదు, దేశవాళీ టోర్నీల్లో కూడా దుమ్మురేపుతున్నాడు. స్పెషల్ టాలెంట్’ అంటూ ఆకాశ్ చోప్రా పోస్ట్ చేశాడు..

Read more Photos on
click me!

Recommended Stories