ఇవీ నా రికార్డులు.. దాచి పెట్టుకోండి..! సెలక్టర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సర్ఫరాజ్

Published : Jan 15, 2023, 03:10 PM IST

Sarfaraz Khan: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగబోయే నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు తప్పకుండా ఎంపికవుతాడనుకున్న  ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ కు ఈసారి కూడా నిరాశ తప్పలేదు. 

PREV
16
ఇవీ నా రికార్డులు.. దాచి పెట్టుకోండి..! సెలక్టర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సర్ఫరాజ్

వచ్చే నెలలో   స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగబోయే  టెస్టు సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టులకు గాను  ఆలిండియా సెలక్షన్ కమిటీ ఇటీవలే జట్టును ప్రకటించింది. అయితే దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ కు ఈ టెస్టులో చోటు దక్కుతుందని అంతా భావించారు.  కానీ ఎప్పటిలాగే  అతడికి నిరాశ తప్పలేదు. 

26

టీ20లలో  గత ఏడాదిన్నర కాలంగా మెరుపులు మెరిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్ ను టెస్టులలోకి తీసుకొచ్చే క్రమంలో  సర్ఫరాజ్ ను పక్కనబెట్టారని  వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో  టీమిండియా మాజీలతో పాటు  క్రికెట్ ఫ్యాన్స్ కూడా  బీసీసీఐ నిర్ణయంపై  గుర్రుగా ఉన్నారు.  

36

దేశవాళీలో   పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ను కాదని సూర్యను టెస్టు జట్టులోకి ఎంపిక చేయడం రంజీ క్రికెట్ ను అవమానించడమేనని,  ఇది ఒక యువ క్రికెటర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమేనని   కామెంట్స్ చేస్తున్నారు. 

46

తాజాగా తనను టెస్టులలోకి ఎంపిక చేయకపోవడంపై    సర్ఫరాజ్ కూడా  పరోక్షంగా స్పందించాడు.  ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తన రికార్డులను తెలియజెప్పే గణాంకాలకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.   ఈ పోస్టుల ద్వారా  సర్ఫరాజ్.. ‘ఇవీ నా ఘనతలు. డౌట్ ఉంటే  చెక్ చేసుకోండి’ అని సెలక్టర్లకు చెప్పకనే చెప్పాడు. 

56

సర్ఫరాజ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబై తరఫున  30 ఇన్నింగ్స్ లలో 2,436 పరుగులు చేశాడు.  ఈ క్రమంలో అతడు 9 సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలు చేశాడు.  సగటు 110.73గా ఉండగా అత్యధిక స్కోరు 301 నాటౌట్ గా ఉంది.  

66

మొత్తంగా  ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో  అత్యధిక  సగటు కలిగి ఉన్న ఆటగాళ్లలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ తర్వాత  సర్ఫరాజ్ ఉన్నాడు.   బ్రాడ్మన్ సగటు (కనీసం  50 ఇన్నింగ్స్ లకు) 95.17 ఉండగా.. సర్ఫరాజ్  యావరేజీ  80.47గా ఉంది.  అంతర్జాతీయంగా దిగ్గజాలుగా పేరొందిన సచిన్, కోహ్లీల సగటు (దేశవాళీలో) కూడా ఇంత లేదు. 

click me!

Recommended Stories