రిషబ్ పంత్ ప్లేస్‌కి అతనే కరెక్ట్! తెలుగు కుర్రాడి కంటే అతనికే అజారుద్దీన్ సపోర్ట్...

Published : Jan 15, 2023, 02:01 PM IST

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, టీమ్‌కి దూరమయ్యాడు. టీ20, వన్డేల్లో రిషబ్ పంత్ లేకపోయినా టీమ్‌కి పెద్దగా నష్టం కలగకపోవచ్చు కానీ టెస్టుల్లో మాత్రం అతని ప్లేస్‌ని రిప్లేస్ చేయడం చాలా కష్టం... బ్రిస్బేన్ టెస్టు తర్వాత టెస్టుల్లో టీమిండియాకి మ్యాచ్ విన్నర్‌గా మారిపోయాడు రిషబ్ పంత్...

PREV
17
రిషబ్ పంత్ ప్లేస్‌కి అతనే కరెక్ట్! తెలుగు కుర్రాడి కంటే అతనికే అజారుద్దీన్ సపోర్ట్...
Rishabh Pant

టెస్టు స్పెషలిస్టు ప్లేయర్లుగా పేరు తెచ్చుకున్న ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లు ఫెయిలైన సమయాల్లో కూడా రిషబ్ పంత్ అద్భుతంగా పోరాడేవాడు. కేప్ టౌన్ టెస్టులో, ఇంగ్లాండ్ టూర్‌లో రిషబ్ పంత్ ఆడిన తీరు అసాధారణం...

27

బంగ్లాదేశ్ టూర్‌లోనూ బ్యాటుతో అదరగొట్టిన రిషబ్ పంత్, 2021-22 సౌతాఫ్రికా టూర్‌లో సెంచరీ చేసిన ఏకైక భారత బ్యాటర్‌గా నిలిచాడు. జేమ్స్ అండర్సన్, కగిసో రబాడా వంటి టాప్ క్లాస్ బౌలర్ల బౌలింగ్‌లో ఈజీగా సిక్సర్లు బాదడం రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో మాత్రమే కనిపించే బ్యూటీ...

37
Rishabh Pant-Pujara

రిషబ్ పంత్ దూరం కావడంతో అతని స్థానంలో అలాంటి బ్యాటర్‌ని వెతికి పట్టుకునే పనిలో బిజీగా ఉంది భారత జట్టు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో ఇషాన్ కిషన్‌తో పాటు తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్‌కి వికెట్ కీపింగ్ బ్యాటర్లుగా అవకాశం కల్పించారు సెలక్టర్లు..
 

47
KS Bharat Ishan Kishan

రెండేళ్లుగా టెస్టు టీమ్‌తో ఉంటున్నా ఇప్పటి దాకా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయలేకపోయాడు శ్రీకర్ భరత్. రిషబ్ పంత్ గైర్హజరీతో ఈసారి కెఎస్ భరత్‌కి అవకాశం రావచ్చని అనుకుంటున్నారు చాలామంది. అయితే భరత్ కంటే ఇషాన్ కిషన్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నాడు హైదరాబాదీ మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ మాజీ హెడ్ మహ్మద్ అజారుద్దీన్...

57

ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్ టీ20కి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న మహ్మద్ అజారుద్దీన్, ‘ఇషాన్ కిషన్‌కి తొలిసారి టెస్టు టీమ్‌లో అవకాశం దక్కింది. శ్రీకర్ భరత్ ఉన్నా, వన్డేల్లో డబుల్ సెంచరీ అందుకున్న ఇషాన్ కిషన్‌ని టెస్టుల్లో ఆడించాలని టీమిండియా భావించవచ్చు.. అదీ కాకుండా అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కూడా...

67

సూర్యకుమార్ యాదవ్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతన్ని వైట్ బాల్ క్రికెట్‌కే పరిమితం చేయడం కరెక్ట్ కాదు. సూర్య ఆడిన గత రంజీ మ్యాచ్‌లోనూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు...

77
Suryakumar Yadav

సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చూస్తుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల్లానే కనిపిస్తాడు. ఈ ఇద్దరిలాగే భారత జట్టుకి సుదీర్ఘ కాలం మూడు ఫార్మాట్లలో పరుగుల చేయగల సత్తా సూర్యకి ఉంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ఇప్పటికే నిరూపించుకున్న ప్లేయర్లు. తుదిజట్టులో వీరికి చోటు కల్పిస్తే బాగుంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్...

Read more Photos on
click me!

Recommended Stories