అందరూ సచిన్‌ టెండూల్కర్‌ని అంటారు కానీ, ఇంజమామ్ వుల్ హక్, ఆసియాలోనే బెస్ట్ బ్యాటర్.. - వీరేంద్ర సెహ్వాగ్..

First Published Jun 5, 2023, 4:28 PM IST

నిన్నటి తరంలో సచిన్ టెండూల్కర్‌తో పోటీ పడిన ప్లేయర్లలో పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ఒకడు. రికీ పాంటింగ్, మహేళ జయవర్థనే, బ్రియాన్ లారా వంటి దిగ్గజాలతో పోటీపడిన ఇంజమామ్ వుల్ హక్, వన్డేల్లో 83 హాఫ్ సెంచరీలు చేశాడు..

పాకిస్తాన్ తరుపున 378 వన్డేలు ఆడి 11,739 పరుగులు చేసిన ఇంజమామ్ వుల్ హక్, 120 టెస్టు మ్యాచుల్లో 8830 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఓ త్రిబుల్ సెంచరీ సాధించిన ఇంజమామ్ వుల్ హక్, వన్డేల్లో 10, టెస్టుల్లో 25 సెంచరీలు సాధించాడు..

‘అందరూ సచిన్ టెండూల్కర్ గురించి చెబుతారు కానీ ఇంజమామ్ వుల్ హక్, ఆసియాలోనే బిగ్గెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. సచిన్‌కి ఎవ్వరితో పోటీ లేదు, ఆయన అందరి కంటే పైనున్నాడు... సచిన్ పాజీ కాకుండా మిగిలిన ప్లేయర్లలో బెస్ట్ అంటే నాకు ముందుగా గుర్తుకువచ్చేది ఇంజమామ్...
 

రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, కుమార సంగర్కర, మహేళ జయవర్థనే ఇతరత్రా శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్ బ్యాటర్ల కంటే ఇంజమామ్ వుల్ హక్ చాలా సుపీరియర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. అతని కంటే బెటర్ బ్యాటర్‌ని నేనైతే చూడలేదు..

2003-04 సమయంలోనే ఇంజమామ్, ఓవర్‌కి 8 పరుగులు చేసేవాడు. అతను తన బ్యాటింగ్ పార్టనర్‌కి భయపడొద్దు, ఈజీగా కొట్టేద్దాం అని చెప్పేవాడు. ఆ కాన్ఫిడెన్స్ చూసి నాకు ఆశ్చర్యమేసేది. చెప్పినట్టే 10 ఓవర్లలో 80 పరుగులు కొట్టేసేవాడు. మిగిలిన ప్లేయర్లు ఎంత కంగారుపడినా ఇంజమామ్ ఎప్పుడూ చాలా నమ్మకంగా బ్యాటింగ్ చేసేవాడు...

2005లో డానిష్ కనేరియా బౌలింగ్‌లో నేను పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. రెండు ఓవర్లు డిఫెన్స్ ఆడేశా. ఆ తర్వాత ఇంజమామ్ వైపు తిరిగి... ‘‘ఇంజీ భాయ్... నా కాళ్లు నొప్పి పెడుతున్నాయ్’’ అని అన్నాను...

దానికి అతను ‘‘నన్నేం చేయమంటావ్’’ అన్నాడు. నేను వెంటనే ‘‘సిక్స్ కొడతా... ఆ ఫీల్డర్‌ని కాస్త లోపల పెట్టు’’ అన్నాను. దానికి ఇంజమామ్ నవ్వాడు. ‘‘సరే నేను సిక్సర్ కొట్టపోతే ఆ ఫీల్డర్‌ని మళ్లీ వెనక్కిపంపించు’’ అని చెప్పాను...

దానికి ఇంజీ భాయ్ సరేనని చెప్పి, ఫీల్డర్‌లోకి లోపలికి రమ్మని చెప్పాడు. ఆ వెంటనే డానిష్ కనేరియా గూగ్లీ బాల్ వేశాడు. నేను ఏమీ ఆలోచించకుండా లాంగ్ ఆన్ దిశగా సిక్సర్ కొట్టాను.. ఫీల్డింగ్‌ మార్చినందుకు కనేరియాకి కోపం వచ్చింది. 

‘‘ఇంజీ భాయ్ ఎందుకని ఆ ఫీల్డర్‌ని లోపలికి తీసుకొచ్చార’’ని అడిగాడు. ‘‘నువ్వు సైలెంట్‌గా వెళ్లి బౌలింగ్ చెయి’ అని ఇంజమామ్, కనేరియాకి చెప్పారు. ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్...

click me!