మరో గత్యంతరం లేక అజింకా రహానేని సెలక్ట్ చేశారు! శ్రేయాస్ అయ్యర్ కోలుకుంటే... - మాజీ సెలక్టర్...

First Published Jun 5, 2023, 1:55 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్ చూపించి, దాదాపు 17 నెలల తర్వాత టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు అజింకా రహానే. ఐపీఎల్‌కి ముందు రంజీ ట్రోఫీలో రహానే చూపించిన పర్ఫామెన్స్ కూడా అతని ఎంపికకి ప్రధాన కారణం...

Ajinkya Rahane

2021 నవంబర్‌లో విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోవడంతో న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన అజింకా రహానే, సౌతాఫ్రికా టూర్ తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయాడు...

Ajinkya Rahane

తన కెరీర్‌లో 82 టెస్టులు ఆడిన అజింకా రహానే, సుదీర్ఘ గ్యాప్ తర్వాత టెస్టు టీమ్‌లోకి తిరిగి వచ్చినా తన స్థానం పదిలం కాదంటున్నాడు టీమిండియా మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...

Ajinkya Rahane

‘అజింకా రహానేకి విదేశాల్లో మంచి రికార్డు ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో అజింకా రహానే పరుగులు చేశాడు. అయితే కొంత కాలంగా ఫామ్‌లో లేకపోవడంతో టీమ్‌లో చోటు కోల్పోయి, 18 నెలల గ్యాప్ తర్వాత టీమ్‌లోకి తిరిగి వచ్చాడు...

Image credit: PTI

ఈ గ్యాప్‌లో అజింకా రహానే దేశవాళీ టోర్నీలు ఆడి, బాగా పరుగులు చేశాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటే, అజింకా రహానేకి తుది జట్టులో చోటు ఉంటుందా? అనేది అనుమానమే..

ఎందుకంటే శ్రేయాస్ అయ్యర్‌ ఇంకా పదేళ్ల పాటు క్రికెట్ ఆడగలడు. అతన్ని ఆడిస్తూ భవిష్యత్‌ని పటిష్టం చేయడం టీమిండియా సెలక్టర్ల బాధ్యత. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో బాగా ఆడితే మాత్రం అజింకా రహానేని వెంటనే తప్పించలేరు...

Image credit: PTI

ఫెయిల్ అయితే మాత్రం అజింకా రహానేకి తర్వాతి టెస్టులో కచ్చితంగా చోటు ఉండదు. మళ్లీ టీమ్‌లో చోటు మిస్ కాకుండా ఉండాలంటే అజింకా రహానే, ఫైనల్ మ్యాచ్‌లో బాగా ఆడాలి, ఆడి తీరాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...
 

click me!