లవ్ జిహాద్‌పై యష్ దయాల్ సంచలన పోస్ట్... ఆ వెంటనే తప్పు తెలుసుకుని డిలీట్ చేసినా...

First Published Jun 5, 2023, 1:32 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒకే ఒక్క ఓవర్‌లో 31 పరుగులు సమర్పించిన గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్‌ వివాదంలో ఇరుక్కున్నాడు. దేశంలో జరుగుతున్న లవ్ జిహాద్ సంఘటనలపై వైరల్ అవుతున్న ఓ మీమ్‌ని ఇన్‌స్టా స్టోరీలో పెట్టాడు యశ్ దయాల్...

‘లవ్ జిహాద్ అనేది లేదు, అదంతా మాపై చేస్తున్న తప్పుడు ప్రచారం. నిజంగా నేను నిన్న ప్రేమిస్తున్నా’ అంటూ ఓ ముస్లిం యువకుడు, కళ్లకు గంతలు కట్టి ఉన్న హిందూ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. దానికి ఆమె.. ‘నాకు తెలుసు అబ్దుల్, నువ్వు అలాంటి వాడివి కాదు. నేను నిన్ను గుడ్డిగా నమ్ముతున్నా’ అని సమాధానం చెబుతుంది...

yash dayal

ఆ ముస్లిం యువకుడు చేతిలో కత్తి ఉండడంతో పాటు చుట్టూ లవ్ జిహాద్‌లో అంతమైన ప్రియ, వర్ష, శివానీ, దీక్ష, రియా, నికిత, నితూ, తనికా, సాక్షి అనే అమ్మాయిల సమాధులు ఉన్నాయి... యశ్ దయాల్ వంటి క్రికెటర్, ఇలాంటి పోస్ట్ చేయడంతో ఒక్కసారి సోషల్ మీడియా షేక్ అవుతోంది..

యశ్ దయాల్ స్టోరీ కొన్ని నిమిషాల్లోనే తెగ వైరల్ అయ్యింది. దీంతో తప్పు తెలుసుకున్న యశ్ దయాల్... ఆ పోస్ట్ డిలీట్ చేసి, క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు. ‘గత పోస్ట్ అనుకోకుండా చేసింది. దయచేసి నాపై ద్వేషం చూపించకండి. నాకు ప్రతీ మతంపై గౌరవం ఉంది’ అంటూ ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు యశ్ దయాల్..

Yash Dayal

గుజరాత్ టైటాన్స్‌లో మహ్మద్ షమీతో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి ముగ్గురు ముస్లిం ప్లేయర్లు ఉన్నారు. దీంతో ఇస్లాం మతాన్ని కించపరిచే విధంగా పోస్ట్ చేసిన యశ్ దయాల్‌ని తీవ్రంగా శిక్షించాలని బీసీసీఐని, గుజరాత్ టైటాన్స్‌ని డిమాండ్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు...
 

మరికొందరు నెటిజన్లు మాత్రం యశ్ దయాల్‌కి మద్ధతుగా నిలుస్తున్నారు. ధైర్యంగా సమాజంలో జరుగుతున్న విషయాన్ని పోస్ట్ చేసినందుకు అతను నిజమైన హీరో అయ్యాడంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. దీంతో ఐపీఎల్ ముగిశాక మరోసారి ట్రెండింగ్‌లో నిలిచాడు యశ్ దయాల్..
 

Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేశాడు యశ్ దయాల్. మొదటి బంతికి ఉమేశ్ యాదవ్ సింగిల్ మాత్రమే తీయగా ఆ తర్వాత వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదిన రింకూ సింగ్, మ్యాచ్‌కి అద్వితీయమైన ముగింపు ఇచ్చాడు..

Rinku Singh KKR

ఈ మ్యాచ్ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన యశ్ దయాల్, జ్వరంతో చాలా మ్యాచులకు దూరంగా ఉన్నాడు. నెలన్నర తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన యశ్ దయాల్, 2023 సీజన్‌లో 5 మ్యాచులు ఆడి 2 వికెట్లు తీశాడు..

click me!